Monday, December 23, 2024

బొల్లారం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్

- Advertisement -
- Advertisement -

పాల్గొన్న గవర్నర్ తమిళిసై, సిఎం రేవంత్ రెడ్డి, ప్రముఖ నేతలు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. ‘ఎట్ హోం’ కార్యక్రమానికి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు, మాజీ మంత్రులు, అధికారులు తదితరులు హాజరయ్యారు.

ఎట్ హోమ్ కార్యక్రమానికి శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ , శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, బిఆర్‌ఎస్ నాయకులు కెటిఆర్, హరీశ్ రావు హాజరయ్యారు. రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూర్చొని సరదాగా మాట్లాడుకున్నారు. రాష్ట్రపతి ముర్ము, గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తదితరులు కాసేపు ఓ చిన్నారితో ఆడుకున్నారు.

At home 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News