Saturday, December 21, 2024

బోటానికల్ గార్డెన్‌లో వృద్ధుల వ్యాయామశాల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : నగరంలో ఎక్కడా లేని విధంగా బోటానికల్ గార్డెన్‌లో వృద్ధుల కోసం ప్రత్యేకంగా వ్యాయామశాల ఏర్పాటు చేశామని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం కొండాపూర్ బోటానికల్ గార్డెన్‌లో వృద్ధుల కోసం ఏర్పాటు చేసిన వ్యాయామశాలను సంస్థ వైస్ చైర్మన్, ఎండి డాక్టర్. జి. చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ బోటానికల్ గార్డెన్‌ను అన్ని హంగులతో సందర్శకులకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దామని వెల్లడించారు. ఆరోగ్య పరంగా, మానసికంగా అహ్లాదం పొందేలా వివిధ ఔషద మొక్కలతో రెండేళ్లలో గార్డెన్‌ను సుందరంగా తీర్చిన ఎండి చంద్రశేఖర్ రెడ్డిని ఆయన అభినందించారు. కార్యక్రమంలో ఈడి రంజిత్ నాయక్, డైరెక్టర్ ఎంజె అక్బర్, జిఎం రవీందర్ రెడ్డి, తిమ్మారెడ్డి, స్కైలాబ్, సుమన్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ రేంజ్ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, హాజీ బాషా,అటవీ సిబ్బంది పాల్గొన్నారు.

Botanical Garden 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News