Monday, January 20, 2025

బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీల్లో నిధుల్లేవు: నారా లోకేశ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని టిడిపి నేత లోకేశ్ మండిపడ్డారు. టిడిపి నేత నారా లోకేశ్‌ను కొనదిన్నె గ్రామస్థులు కలిశారు. తమ సమస్యలపై లోకేశ్‌కు స్థానికులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మీడియాతో మాట్లాడారు. తొమ్మిది వేల కోట్ల పంచాయతీ నిధులను ప్రభుత్వం దొంగలించిందని లోకేశ్ విమర్శించారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా పంచాయతీల్లో నిధుల్లేని దుస్థితి ఏర్పండిందని లోకేశ్ చురకలంటించారు. శ్మశానాలను సైతం వైసిపి పిశాచాలు కబ్జా చేస్తున్నాయని, ఎపిలో పేదల ఇళ్లకు కేంద్రం ఇచ్చిన నిధులను కూడా జగన్ రెడ్డి సర్కార్ దారి మళ్లించిందని దుయ్యబట్టారు. టిడిపి అధికారంలోకి రాగానే గ్రామసీమలకు గత వైభవం తెస్తామని హామీ ఇచ్చారు. పేదల ఇళ్ల పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తామన్నారు.

Also Read: యుపిలో దారుణం.. దళిత యువకుడితో చెప్పులను నాకించి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News