లండన్ : బ్రిటన్‌లో భార్యను దారుణంగా హత్య చేసి, మృతదేహాన్ని 200 ముక్కలుగా చేశాడో కిరాతక భర్త. తన ఇంట్లోనే వారం రోజుల పాటు దాచి ఉంచి, తరువాత సమయం చూసి నదిలో పడేశాడు. బ్రిటన్‌కు చెందిన నికోలస్ మెట్సన్ (28) , హోలీబ్రామీ (26) కి ఏడాది క్రితం వివాహమైంది. వీరి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. దీంతో భర్త కొన్నాళ్లుగా ఆమెను తన తల్లిదండ్రులతో కలియకుండా చేశాడు. ఆమె పెంపుడు జంతువులను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఈ పరిస్థితుల్లో మెట్సన్ ఆమెను దారుణంగా హత్య చేసి వారం రోజుల పాటు మృతదేహాన్ని వంటగదిలో దాచాడు.
మృతదేహాన్ని 200 ముక్కలు చేసి స్నేహితుడి సాయంతో నదిలో పడేశాడు. మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఒక వ్యక్తి నదిలో తేలియాడుతున్న ప్లాస్టిక్ కవర్లను, అందులోని శరీర భాగాలను చూసి పోలీస్‌లకు ఫిర్యాదు చేశాడు. దీంతో మెట్సన్ దారుణం బయటపడింది. పోలీస్‌లు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని భాగాలు ఇంకా దొరకలేదు. మెట్సన్‌ను పోలీస్‌లు అరెస్ట్ చేయగా, నేరం అంగీకరించాడు. సోమవారం అతడికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేయనున్నట్టు సమాచారం