పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కి ధమాకా మేకర్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ మాస్ ఎంటర్‌టైనర్‌లో రీతు వర్మ హీరోయిన్. మన్మధుడు ఫేమ్ అన్షు, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. ఈ హైలీ ఎంటర్‌టైనింగ్ మూవీ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్…
ఈ సినిమాలో నా క్యారెక్టర్ పేరు కృష్ణ. నేను, నాన్న ఒకే ఇంట్లో బ్యాచిలర్స్‌గా బ్రతుకుతుంటాం. మమల్ని ఎవరూ పండగలకి పబ్బాలకి పిలవరు. కలిసి తాగిపోడిపోయే తండ్రి కొడుకులంగా కనిపిస్తాం. సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు వుంటాయి. చాలా ఫన్, ఎంటర్‌టైన్‌మెంట్ వుంటుంది. ‘మజాకా’ క్లీన్ కామెడీ ఎంటర్‌టైనర్. లాఫ్ రైడ్‌గా వుంటుంది.
పాటలు జనాల్లోకి వెళ్తున్నాయి…
లియోన్ మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. తన మ్యూజిక్ ఈ సినిమాకి ఫ్రెష్‌నెస్ తీసుకొస్తుంది. బ్లాక్ బస్టర్ ఆల్బమ్ కావాలని చెప్పాను. అయితే పాటల్ని జనాల్లోకి తీసుకెళ్ళే సమయం దొరకలేదు. అయినప్పటికీ బేబమ్మ, సోమ్మసిల్లి పోతున్నావే పాటలు జనాల్లోకి వేగంగా వెళ్తున్నాయి.
ఇప్పటివరకూ రాని కాన్సెప్ట్‌తో…
ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చేయాలనే మజాకా చేశాను. దీనికి త్రినాధ్ రావు, ప్రసన్న కలసి రావడం లక్కీగా కుదిరింది. ఇప్పటివరకూ రాని కాన్సెప్ట్ ఈ సినిమాలో వుంది. ఇది ఆడియన్స్‌ని సర్‌ప్రైజ్ చేస్తుంది. అందరూ కలసి చూడదగ్గ సినిమా చేయాలనే ఉద్దేశంతో చేసిన సినిమా ఇది.
మా క్యారెక్టర్స్ చాలా బ్యూటీఫుల్‌గా..
రీతు వర్మ ఈ సినిమాకి ఒక ఫ్రెష్‌నెస్ జత చేసింది. తనకి ఇలాంటి సినిమాలు కొత్త. మా క్యారెక్టర్స్ చాలా బ్యూటీఫుల్‌గా వచ్చా యి. రావు రమేష్‌తో కలిసి పనిచేయడం చాలా బాగా అనిపించింది. మా కెమిస్ట్రీ చాలా నేచురల్‌గా వర్కవుట్ అయ్యింది.
అందుకే వరుసగా బ్లాక్‌బస్టర్స్…
త్రినాథ్ రావుకు సినిమా గ్రామర్ తెలుసు. సీన్ ని ఎలా తీస్తే పండుతుందో తెలిసిన డైరెక్టర్. అందుకే వరుసగా బ్లాక్‌బస్టర్స్ కొడుతున్నారని భావిస్తున్నాను. రాజేష్, అనిల్ అంటే నాకు హోం ప్రొడక్షన్. ఒకరు అన్నయ్య, మరొకరు ఫ్రెండ్‌లా వుంటారు. చాలా పాజిటివ్‌గా కలసి పని చేస్తాం.