న్యూఢిల్లీ :మధ్యప్రదేశ్‌లో తిరిగి బిజెపికి అధికారం ఖాయం కావడంతో సిఎం పీఠంపై శివరాజ్ సింగ్ చౌహాన్‌కు ఢోకా లేకుండా పోయింది. అధికార వ్యతిరేక ఓటు ప్రభావాన్ని అధిగమించి శివరాజ్ సింగ్ పార్టీని తిరిగి గెలుపు గుర్రంగా నిలబెట్టారు. దీనితో బిజెపి అధిష్టానం ఇప్పుడు సిఎం పదవికి వేరే నేతను ఎంపిక చేసే ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో బిజెపి మూడింట రెండొంతుల మెజార్టీతో తిరిగి అధికారంలోకి రానుండటం శివరాజ్ సింగ్ చౌహాన్ పట్ల తన ప్రాబల్యపు ప్రజామోదం గురించి ఇటు విశ్లేషకులకు, అటు పార్టీ నేతలకు కూడా చాటుకున్నారు. ఈ సారి ఎన్నికల దశలో బిజెపి నాయకత్వం సిఎం పీఠానికి ప్రత్యామ్నాయ పేర్లను కూడా పరిశీలించింది. అయితే ఈ విషయాన్ని ప్రత్యక్షంగా తెలియచేయకుండా కేంద్ర మంత్రులు, ఎంపిలను కూడా బరిలోకి దింపడం ద్వారా చాటుకుంది.
పైగా తమ పార్టీ తరఫున సిఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించడం లేదని తెలిపారు. ఇది తమ పార్టీ పద్ధతి కూడా కాదని స్పష్టం చేశారు. మధ్యప్రదేశ్‌కు సంబంధించినంత వరకూ చౌహాన్‌ను తప్ప మరో ఫెవరేటును ఎంచుకునే స్థితిలో బిజెపి లేదు. కాగా మధ్యప్రదేశ్‌తో పాటు విజయం సాధించిన రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో నాయకత్వ పీఠం కోసం పందెం విస్తృతంగా ఉంది. మధ్యప్రదేశ్‌లో దిమానీ నియోజకవర్గం నుంచి కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ పోటీ చేశారు. ఆయన , రాష్ట్రానికే చెందిన జ్యోతిరాదిత్య సింధియా ఇద్దరూ సిఎం పదవి పోటీదార్ల పేర్లలో నిలిచారు. తిరుగులేని మెజార్టీ దక్కించుకున్న మధ్యప్రదేశ్ విషయంలో బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ చౌహాన్‌ను కాదని వేరే వ్యక్తికి సిఎం పీఠానికి అప్పగించే అవకాశం లేదని స్పష్టం అయింది.
మధ్యప్రదేశ్‌లో బిజెపి పునః అధికార ప్రస్థానానికి ప్రధాని మోడీ, సిఎం చౌహాన్‌ల పట్ల ప్రజాదరణ, ప్రచారంలో సమర్థవంతైన బూత్‌ల స్థాయి వ్యూహాలు కారణం అయ్యాయి. బిజెపి ఇక్కడ అధికారంలో ఉన్నా, చౌహాన్ రెండుసార్లు సిఎం అయినాఎక్కడా అలసత్వం ప్రదర్శించలేదు. ప్రజల్లోతనకున్న విశేష పాపులార్టీని ప్రచార దశలో పార్టీ పట్ల ఓట్లు రాబట్టుకునేందుకు పాటుపడ్డారు. మామా అని అంతా పిలిచే చౌహాన్ అంటే సామాన్యులలో ప్రత్యేకించి మహిళలు, యువతలో అభిమానం ఉంది.
పైగా ఆయన తమ ప్రచారంలో తరచూ ఎంపి కే మన్ మే మోడీ అనే నినాదంతో రాష్ట్రంలో బిజెపి పట్ల బలాన్ని విస్తృతం చేశారు. చౌహాన్ పట్ల పార్టీనేతలలో కొందరికి అసంతృప్తి ఉండటం పెద్ద సవాలు అయింది. బిజెపిలో సింధియా వర్గం , శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మధ్య సరైన సమన్వయం లేకుండా పోయిది. ఈ పరిణామాన్ని ఇప్పట్లో చక్కదిద్దడ కుదరదని భావించే శివరాజ్ సింగ్ చౌహాన్ క్షేత్రస్థాయిలో ప్రచారానికి ఎక్కువ విలునిచ్చారు. తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను, వీటి అమలు తీరు తెన్నులను ప్రజలకు నేరుగా తెలియచేయడంపైనే దృష్టి సారిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన విజయం సాధించినట్లు ఇప్పుడు ఫలితాల సరళితో స్పష్టం అయింది.