యంగ్ హీరో శివ కందుకూరి కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘మను చరిత్ర’. ఇంటెన్స్ లవ్ స్టొరీగా రూపొందింది. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియా వడ్లమాని, ప్రగతి శ్రీవాత్సవ్ కథానాయికలు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్. శ్రీనివాస రెడ్డి నిర్మించారు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. జూన్ 23న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా మీడియాతో శివ కందుకూరి ముచ్చటించారు.
‘మను చరిత్ర’ టైటిల్ వెనుక కథేంటి? మీ క్యారెక్టర్ ఎలా ఉంది?
నేను టైటిల్ రోల్ ప్లే చేశా. నా పాత్ర పేరు మను. అతడి ఏడెనిమిదేళ్ళ జీవితాన్ని సినిమాలో చూపిస్తున్నాం. అందుకే, ‘మను చరిత్ర’ టైటిల్ యాప్ట్ అనిపించింది. ట్రైలర్ లో చూపించినట్లు మను క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ఒక కాలేజీ స్టూడెంట్ ఎందుకు అలా అయ్యాడనేది మేం చెబుతున్నాం. అందులో బ్యూటిఫుల్ లవ్ స్టోరీ చెప్పే ప్రయత్నం చేశాం. మనం కొత్తగా ఏ ప్రేమకథను చెప్పలేం. నేపథ్యమే కథను కొత్తగా మారుస్తుంది. వరంగల్ గుండాయిజం నేపథ్యంలో దర్శకుడు కథ రాశారు. అందరూ రిలేట్ చేసుకునేలా క్యారెక్టర్ ఉంటుంది. అలాగే, చాలా షేడ్స్ ఉంటాయి.
దర్శకుడు భరత్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేదంటే మీరు భరత్ ను అప్రోచ్ అయ్యారా?
నేను వేరే సినిమా కోసం ఆడిషన్ చేస్తున్నాను. లిరిసిస్ట్ సిరాశ్రీ గారు చెప్పడం ద్వారా ఆ ఆడిషన్ కు వెళ్ళా. భరత్ గారు ఆ ఆడిషన్ టేప్ చూసి ‘మను చరిత్ర’ కోసం కాంటాక్ట్ చేశారు. యాక్టర్ గా కమర్షియల్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అప్పటి వరకు విన్న కథలు టెంప్లేట్ మోడ్ లో ఉన్నాయి. ‘మను చరిత్ర’ కథ విన్నప్పుడు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఆర్గానిక్ ప్రోగ్రెషన్ ఉంటుంది. ఫోర్స్డ్ గా ఫైట్స్, సీన్స్ ఉండవు. కథలో భాగంగా అన్నీ వచ్చాయి. నటుడిగా ఎదగడానికి ఇటువంటి కథ అవసరం అనిపించింది. విన్న వెంటనే ఓకే చెప్పేశా.
మీరు ఇప్పటివరకు చేసినవి సాఫ్ట్ క్యారెక్టర్స్. ఇందులో రఫ్ క్యారెక్టర్ చేశారు. ప్రిపరేషన్ ఏమైనా?
క్రెడిట్ అంతా డైరెక్టర్ భరత్ గారికి ఇవ్వాలి. నాకు ఫస్ట్ టైమ్ స్టోరీ నేరేట్ చేసినప్పుడు మూడు గంటలు చెప్పారు. ప్రతిదీ డిటైలింగ్ గా నేరేట్ చేశారు. షాట్ మేకింగ్, కెమెరా యాంగిల్స్ నుంచి క్లియర్ గా చెప్పారు. దర్శకుడిగా ఆ క్లారిటీ ఉన్నప్పుడు యాక్టర్స్ వర్క్ ఈజీ అవుతుంది. ఆయన అంత వర్క్ చేసినా, ఏ రోజూ మీరు ఇలాగే చేయాలని చెప్పలేదు. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. షూటింగ్ స్టార్ట్ చేయడానికి 30 రోజుల ముందు మేనరిజమ్, యాస విషయాల్లో ఓ డెసిషన్ తీసుకున్నాం. వర్క్ షాప్ చేశాం.
మీ ముందు సినిమాల్లో ఇంత మంది హీరోయిన్లు లేరు. ఈ సినిమా బడ్జెట్ కూడా ఎక్కువ అయిందనుకుంటా!
అవును. ఇంతకు ముందు సినిమాల్లో ఇంత మంది లేరు. క్యారెక్టర్ పరంగా మేం వెళ్లాం. బడ్జెట్ అంటే శ్రీనివాసరెడ్డి గారు ఇంతలో సినిమా తీయమని ఎప్పుడు చెప్పలేదు. కథకు అవసరం అంటే ఎప్పుడూ నో చెప్పలేదు. దర్శకుడికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో బాగా తీశారు. ఎక్కడ ఓవర్ ద టాప్ తీయలేదు. ఇంత మంది అమ్మాయిలు ఉన్నా గ్లామర్ యాడ్ చేయాలని ఎవరిని పెట్టలేదు. డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు. ఫ్యామిలీతో కలిసి సినిమా చూడొచ్చు. నేను అది బలంగా చెబుతా.
ముగ్గురు హీరోయిన్లను తీసుకోవడానికి కారణం?
సినిమాలో క్రైమ్ ఎలిమెంట్ కూడా ఉంది. ఆ బ్యాక్ డ్రాప్ చెప్పడానికి ఒక లవ్ స్టోరీ ఉపయోగపడింది. ఒక అమ్మాయితో సినిమా చేస్తే ఆ ఇంట్రెస్ట్ వచ్చేది కాదేమో! ఒక్క ప్రేమ కథతో అంత ఇంటెన్స్ రాదేమో!
గోపీసుందర్ మ్యూజిక్ గురించి…
ఆయనతో నా సెకండ్ ఫిల్మ్ ఇది. దీనికి ముందు ‘చూసీ చూడంగానే’ చేశా. ఆయనతో బ్యూటిఫుల్ ర్యాపో ఉంది. ఒక ట్యూన్ కోసం నాలుగైదు ఆప్షన్స్ ఇచ్చేవారు. వరంగల్ నేపథ్యం కనుక ఆ ప్రాంతంలో వినిపించే సౌండ్స్ కావాలని అడిగితే రీ వర్క్ చేశారు. రీసెంట్ టైమ్స్ లో తెలుగులో ఆయన ఇటువంటి సినిమా చేయలేదు. ఫైవ్ సాంగ్స్, 2 బిట్ సాంగ్స్ ఉన్నాయి.
సినిమా చూసి మీ నాన్నగారు ఏమన్నారు?
కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి చేశానని చెప్పారు. అది కాంప్లిమెంట్. కొత్త హీరోకి ఇటువంటి ఛాన్స్ రావడం అరుదు.
‘మను చరిత్ర’ను లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయాలనుకున్నారట!
సెప్టెంబర్ 9న అనుకున్నాం. విడుదలకు రెండు వారాల ముందు పది రోజుల ఫుటేజ్ మిస్ అయ్యిందని గుర్తించాం. ఫుటేజ్ స్టోరేజ్ థర్డ్ పార్టీ వాళ్ళకు ఇచ్చాం. అప్పటికి నేను వేరే సినిమా షూటింగ్ చేస్తున్నా. అందువల్ల, లేట్ అయ్యింది. ఫారిన్ పంపిస్తే కొంత రికవర్ చేశారు. తర్వాత మళ్ళీ షూట్ చేశాం. మధ్యలో ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ చేశా. అది కూడా విడుదలకు రెడీ అయ్యింది. ఈ సినిమాను శ్రీ విజయ ఫిలిమ్స్ నవీన్ గారు టేకోవర్ చేశారు. ఆయన జూన్ 23న రిలీజ్ చేయాలనుకున్నారు. అప్పుడు ఇద్దరు నిర్మాతలను కూర్చోబెట్టి మాట్లాడా. అందరం కలిసి ముందు ఈ సినిమా రిలీజ్ చేయాలనుకున్నాం.
మీ నెక్స్ట్ మూవీస్?
‘భూతద్దం భాస్కర్’ రెడీగా ఉంది. మార్చి 31న విడుదల చేయాలనుకున్నాం. సీజీ వర్క్ వల్ల డిలే అయ్యింది. త్వరలో ఆ సినిమా వస్తుంది.