Friday, November 8, 2024

మా ఆసుపత్రి మా ఇష్టం

- Advertisement -
  • ఎప్పుడైనా వస్తాం, ఎప్పుడైనా వెళ్తాం మీకెందుకు
  • ములుగు ఆసుపత్రి సిబ్బంది తీరు
    ములుగు: రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సర్కారు వైధ్యం అందుబాటులోకి తీసుకువచ్చి మెరుగైన సేవలను అందించేందుకు ఎన్నో కార్యక్రమాలు అమలుచేస్తుంది. కోట్ల రూపాయల నిధులను ఇందుకోసం ఖర్చుచేస్తుంది. ప్రభుత్వ ఆశయం నెరవేర్చాల్సిన వైధ్యాదికారులు,సిబ్బంది విధుల్లో నిర్లక్షం వహిస్తూ ఇష్ట్టారీతిన వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్షం వల్ల ప్రజలకు సర్కార్ వైధ్యం అందకుండా పోతుంది. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే మా ఆసుపత్రి మా ఇష్టం ,ఎప్పుడైనా వస్తాం ,ఎప్పుడైనా పోతాం అడగటానికి మీరెవరు,మీకెం ఇబ్బంది అంటూ వ్యంగ్యంగా సమాధానం చెప్తున్నారు.
  • ఇదంత ముఖ్యమంత్రి కెసిఆర్ సొంత నియోజకవర్గం, వైధ్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు సొంత జిల్లాలోని ములుగు మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరుగుతున్న తతంగం ఈ విషయమై ఉన్నతాధికారులకు తెలిసిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ప్రజలు వ్య క్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇక్కడేం కొత్త కాదని ప్రజలంటున్నారు. ములుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైధ్య సిబ్బంది నిర్లక్షంతో ప్రజలకు సర్కారు వైధ్యం అందని ద్రాక్షల మారింది.
    పేదలకు అందని వైధ్యం : నిరుపేదలకు వైధ్యాన్ని నిరంతరం అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం ములుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 24 గంటల ఆసుపత్రిగా ఏర్పాటు చేసింది. ఇక్కడ పని చేస్తున్న వైధ్యాదికారిని దీప్తి, విధులకు ఎప్పుడు వస్తుందో,ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వచ్చిన రోజు ఉదయం 11 గంటకు నుండి మధ్యహ్నం 2 గంటల వరకు మా త్రమే ఆసుపత్రిలో అందుబాటులో ఉంటున్నారు.
    ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతారు. సమంయంలో ఆసుపత్రికి వచ్చే రోగులకు వైధ్యం అందడంలేదు. నిబందనల ప్రకారంగా ఒక్కరే వైద్యాదికారి ఉన్నప్పుడు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండాలి. ప్రస్తుతం ఉన్న వైద్యాదికారి 11 గంటల నుండి 2 గంటల వరకు మాత్రమే ఉంటున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. మిగిలిన సమయాల్లో ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్య సేవలు అందించాల్సిన స్టాప్ నర్సులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఆ
  • సుపత్రిలో ఉన్న ఇద్దరు స్టాప్ నర్సుల్లో ప్రతి రోజు ఒక్కొక్కరు 12 గంటలపాటు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది కానీ ఇందుకు విరుద్దంగా వైధ్యాదికారి సపోర్ట్ తో ఒక్కో స్టాప్ నర్సు రోజంత ఆసుపత్రిలోనే ఉంటూ మరో రోజు ఇంటి వద్ద సేదతీరుతున్నారు. ఇందుకు వైధ్యాదికారి మద్దతు ఇస్తున్నారు. హాజరు మాత్రం ప్రతిరోజు విధులు నిర్వహిస్తున్నట్లు సంతకాలు చేస్తున్నారు. ఇదంత ఉన్నతాదికారులకు తెలిసే జరుగుతుందని సమాచారం. ఇంకో విషయం ఏమిటంటే ఉపకేంద్రాల్లో పని చేయాల్సి ఏఎన్‌ఎం లతో కూడా ఆసుపత్రిలో పనిచేయిస్తున్నారు.
  • దీని వల్ల ఉప కేంద్రాల్లో ఏఎన్‌ఎం లు అందుబాటులో ఉండటం లేదని ఆయా గ్రా మాల్లో ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇక ఆసుపత్రికి వచ్చిన రోగులకు మందులు ఇవ్వాల్సిన ఫార్మసిస్టు ఉదయం 9 గంటల నుండి 2 గంటల వరకు అందుబాటులో ఉంటారు. మిగిలిన సమయంలో ఫార్మసిస్టు గదికి తాళం వేసి ఉంటుంది. ఆసుపత్రికి వచ్చిన రోగులకు సిబ్బంది వద్దనున్న మందులతో సరిపెడుతున్నారు.
    పట్టించుకోని ఉన్నతాధికారులు : ములుగు ఆసుపత్రిలో సిబ్బంది విధులు సక్రమంగా నిర్వహిస్తలేరనే సంగతి జిల్లా స్థాయి ఉన్నతాదికారులకు తెలిసిన విషయమే. సిబ్బందిని కట్టడిచేసి పేదలకు వైధ్యం సక్రమంగా అందే విధంగా చూడాల్సిన ఉన్నతాదికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. విదుల్లో నిర్లక్షం చేస్తున్న సంబంధిత అదికారులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. లేని పక్షంలో ఆందోళనలు చేయాల్సివస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News