మన తెలంగాణ / మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం గురువారం పరిశీలించిం ది. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు నిపుణుల బృం దాన్ని నియమించి సమగ్ర విచారణ చేపట్టింది. మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజీల డిజైన్‌పై మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం బ్యారేజీలో లీకేజీ (సీపేజ్) కారణంగా ప్రాజెక్టుపై ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య డిజైన్, సాంకేతికత, రైతుల ప్రయోజనాలపై సందిగ్ధత నెలకొంది.బ్యారేజీలను ఉపయోగంలోకి తేవడంతో పాటు సాంకేతికంగా గత ప్రభుత్వం డిపిఆర్‌పై అనుసరించిన వి ధానాలను, నిర్మాణ సంస్థ పనితీరును విశ్లేషించడంతోపాటు బ్యారేజీల మునుగడపై తీసుకోవలసిన జాగ్రత్తలను, ఉపయోగాలను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నిపుణుల బృందం సమగ్ర నివేదిక అందజేయనున్నది.
నేషనల్ సేఫ్టీ అథారిటీ నియమించిన చంద్రశేఖర్ అయ్యర్ బృందం మేడిగడ్డ బ్యారేజీ రెండువైపులా క్షుణ్ణంగా తనిఖీలను చేపట్టింది. ఈ బృందంలో యుసి విద్యార్థి, ఎస్‌ఏ పాటిల్, శివకుమార్ శర్మ, సి రాహుల్ కుమార్, అమితాబ్ బేనాలు సభ్యులుగా ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఏడవ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్లు 5 మీటర్ల మేర కుంగిపోవడంతో పాటు పగుళ్లు ఏర్పడ్డాయి. మరోవైపు అన్నారంలో నీటి బుంగ ఏర్పడడంతో పెద్ద ఎత్తున సీపేజ్ ఏర్పడింది. ఈ బృం దం సభ్యులు మేడిగడ్డ బ్యారేజీను పూర్తిగా పరిశీలించారు. నిర్మాణ సమయంలో ఉన్న ప్రతి ఇంజనీరింగ్ అధికారి హాజరుకావాలని వీరు ఆదేశించినట్లు సమాచారం. బుధవారం హైదరాబాద్‌లోని ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమైన అనంతరం గురువారం ఉద యం నిపుణుల బృందం మేడిగడ్డకు చేరుకున్నది. మేడిగడ్డ బ్యారేజీని ఈ బృందం క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం అన్నారం బ్యారేజీ, సుందిళ్ల బ్యారేజీని పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. తదుపరి చర్యలు చేపట్టడానికి అనువుగా ప్రాథమిక నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి నిపుణుల బృందాన్ని కోరారు. సమగ్ర నివేదిక నాలుగు నెలల సమయం పట్టవచ్చని తెలుస్తోంది.