Sunday, January 19, 2025

రంగధాముని చెరువును సుందరీకరించిన హెచ్‌ఎండిఏ

- Advertisement -
- Advertisement -
ప్రారంభించిన మంత్రి కెటిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్:  కూకట్‌పల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న రంగధాముని చెరువును హెచ్‌ఎండిఏ సుందరీకరించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి కెటిఆర్ గురువారం దానిని ప్రారంభించారు. రంగధాముని సరస్సు కూకట్‌పల్లి నియోజకవర్గంలోని 46.24 ఎకరాల ఎఫ్‌టిఎల్ విస్తీర్ణంలో 568 మీటర్ల పొడవుతో ప్రధాన కట్టతో నిండి ఉంది. ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇక్కడకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే స్థానికులు, ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు మంత్రి కెటిఆర్ ఈ చెరువును సుందరీకరించాలని హెచ్‌ఎండిఏ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా హెచ్‌ఎండిఏ రూ.9.80 కోట్ల అంచనా వ్యయంతో ఈ సరస్సు సుందరీకరణను చేపట్టింది. సుందరీకరణలో భాగంగా ప్రధాన కట్టపై పేవర్ బ్లాక్‌లు, కోబుల్ స్టోన్, గ్రానైట్ ఫ్లోరింగ్‌తో దారులను హెచ్‌ఎండిఏ ఏర్పాటు చేసింది. స్టెప్డ్, క్యూబికల్ సీటింగ్‌తో పాటు శిల్పాలు, లైటింగ్, టాయిలెట్ బ్లాక్, మెయిన్‌బండ్‌పై సాఫ్ట్‌స్కేప్‌లతో పాటు సివిల్ పనుల కోసం చేసిన రూ.7.6 కోట్లను హెచ్‌ఎండిఏ వెచ్చించడంతో పాటు రూ.38.52 లక్షలతో సుందరీకరణ పనులు చేపట్టడంతో ప్రస్తుతం ఈ చెరువు స్థానికులను ఆకట్టుకుంటోంది.

KTR 2A

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News