Saturday, November 23, 2024

రహానెపై వేటు తప్పదా?

- Advertisement -
- Advertisement -

 

ముంబై: పేలవమైన ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా సీనియర్ ఆటగాడు, టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. వరుస వైఫల్యాలు చవిచూస్తున్న రహానె టెస్టు జట్టులో స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో రహానె రెండు ఇన్నింగ్స్‌లలో కూడా విఫలమయ్యాడు. దీంతో ముంబైలో జరిగే రెండో టెస్టులో అతనికి తుది జట్టులో స్థానం దక్కుతుందా అనేది సందేహంగా మారింది. యువ ఆటగాళ్లు సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్‌లతో రహానెకు గట్టి పోటీ నెలకొంది. ఇలాంటి స్థితిలో ఫామ్‌లో లేని రహానెకు మరో అవకాశం ఇస్తారా లేకుంటే తొలి టెస్టులో రాణించిన శ్రేయస్‌ను జట్టులో కొనసాగిస్తారా అ నేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కెప్టెన్‌గా జట్టును బాగానే నడిపించినా బ్యాటర్‌గా మాత్రం రహానె ఆశించిన స్థాయిలో రాణించలేక పోయా డు. ఇది అతనికి ప్రతికూలంగా మారింది. చాలా కాలంగా రహానె తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచ లేక పోతున్నాడు. సీనియర్ అనే ఒకే ఒక్క కారణంతో జట్టులో స్థానాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు.వరుస అవకాశాలు లభిస్తున్నా రహానె దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోలేక పోతున్నాడు.

ప్రతి సిరీస్‌లోనూ విఫలమవుతూ జట్టుకు భారంగా మారాడు. ఇలాంటి స్థితిలో అతనిపై వేటు వేయాలనే డిమాండ్ రోజు రోజుకు పెరిగి పోతోంది. కొంతకాలం అతనికి విశ్రాంతి ఇచ్చి యువ ఆటగాళ్లతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని పలువురు మాజీ ఆటగాళ్లు సూచిస్తున్నారు. కానీ ఎంతో అనుభవజ్ఞుడైన రహానెను తుది జ ట్టులో నుంచి తొలగించే సాహసం బిసిసిఐ చే స్తుందా అనేది సందేహమే. ముంబై టెస్టులో విరా ట్ కోహ్లి తిరిగి కెప్టెన్సీ చేపట్టనున్నాడు. దీంతో రహానెను ఏ స్థానంలో ఆడించాలన్నది జట్టు యా జమాన్యం ఎటూ తేల్చుకోలేక పోతోంది. రహానెతో పోల్చితే సూర్యకుమార్, అయ్యర్‌లు కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్నారు. ఇక అరంగేట్రం టెస్టులోనే అయ్యర్ చెలరేగి పోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో శతకం, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. రహానె మాత్రం రెండు ఇన్నింగ్స్‌లలో కూడా తక్కువ స్కోరుకే పరిమితం అయ్యాడు. మరో సీనియర్ చటేశ్వర్ పుజారా కూడా అంతంత మాత్రం బ్యాటింగ్‌తో నిరాశ పరుస్తున్నాడు. టెస్టుల్లో జట్టుకు ఎంతో కీలకమైన పుజారా, రహానె వైఫల్యం టీమిండియాకు ప్రతికూలంగా తయారైంది. రానున్న దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో యువ ఆటగాళ్లను పరీక్షించాలని భావిస్తే మాత్రం రహానె తుది జట్టులో స్థానం కోల్పోవడం ఖాయం. ఒకవేళ రహానెను జట్టులో కొనసాగించాలంటే ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌ను జట్టులో నుంచి తప్పించాల్సి ఉంటుంది. అప్పుడూ ఓపెనర్‌గా వృద్ధిమాన్ సాహా బరిలోకి దిగుతాడు. రహానె మిడిలార్డర్‌లో ఆడతాడు. ఇది ఒక్కటే కెప్టెన్ కోహ్లి ముందున్న ఏకైక ప్రత్యాన్మయంగా కనిపిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News