Monday, December 23, 2024

రాజగోపాల్ రెడ్డి లేటెస్ట్ కామెంట్స్!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ లోక్‌సభ సభ్యుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి సరికొత్తగా కొత్త పాట అందుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిఆర్‌ఎస్ కవిత రేపో మాపో అరెస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు. మునుగోడులో ఓడి భంగపాటు పడ్డా ఇంకా భీరాలు పలుకుతున్నారు. ప్రజా వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి టిఆర్‌ఎస్ కాస్తా బిఆర్‌ఎస్‌గా అవతరించిందన్నారు. అదే పనిగా బిఆర్‌ఎస్ ను విమర్శిస్తున్నారు. ఆయన ఏమి మాట్లాడుతున్నారో, ఆయన మాట్లాడే దాంట్లో నిజమెంతో ఆయనకే తెలియాలి.

తనను రాజకీయంగా ఎదుర్కొనలేకే కెసిఆర్, రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, తాను అమ్మడుపోయానని అంటున్నారని అన్నారు. దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా తాను చెబుతున్నానని…తాను ఎవరికీ అమ్ముడుపోలేదని అన్నారు. తనను కొనే శక్తి పుట్టలేదు, పుట్టబోదు అన్నారు. దమ్ముంటే తన అవినీతిని నిరూపించాలన్నారు. బిఆర్‌ఎస్ పాలన స్థానంలో బిజెపి పాలన వస్తేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని అన్నారు. కానీ బిజెపి వల్ల దేశంలో ఎక్కడ ఎలాంటి మేలు జరిగిందో మాత్రం చెప్పలేదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఎంత హాయిగా ఉన్నారో తెలుపలేదు. అంతేకాదు బిఆర్‌ఎస్‌ను బొంద పెట్టేంత వరకు నిద్రపోనని ప్రతిజ్ఞ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News