- Advertisement -
ఐపిఎల్ లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడుతున్నాయి. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. గుజరాత్ ఓపెనర్లు మంచి శుభారంబాన్నిచ్చారు.తొలికి వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 10.2 ఓవర్ లో తీక్షణ వేసిన బంతికి సాయి సుదర్శన్(39;30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) లాంగాన్ లో రియాన్ పరాగ్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. శుభమన్ గిల్ (84;50 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్ లు) తీక్షణ వేసిన 16.4 ఓవర్ లో రియాన్ పరాగ్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. జాస్ బట్లర్(50; 26 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్ లు),వాషింగ్టన్ సుందర్ (13) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ 2, జోప్రా ఆర్చర్ , సందీప్ శర్మ చెరో వికెట్ తీశారు.
- Advertisement -