Thursday, January 23, 2025

రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ ‘సంకల్ప్ సత్యాగ్రహ’

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ‘తప్పుడు పద్ధతుల్లో దోషిని చేసి, లోక్‌సభ నుంచి అనర్హుడిగా వేటువేసిన కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి సంఘీభావంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మహాత్మా గాంధీ స్మారకమైన ‘రాజ్‌ఘాట్’ వద్ద నిరసన చేపట్టారు. దీనికి రాహుల్ సోదరి ప్రియాంక గాంధీ సహా బడా నాయకులు కూడా హాజరయ్యారు. ఇదేవిధంగా దేశవ్యాప్తంగా పలుచోట్ల నిరసనలు జరిగాయి.

రాజ్‌ఘాట్ వద్ద కాంగ్రెస్ నాయకులు ‘ రాజ్యాంగాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అనే సంకల్ప సత్యాగ్రహ’ చేపట్టారు. ఈ సత్యాగ్రహ సాయంత్రం 5.00 గంటల వరకు కొనసాగనున్నదని పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ ట్వీట్ చేశారు. ఈ నిరసనకు మొదట పోలీసులు ‘శాంతిభద్రతలు, ట్రాఫిక్ ఆటంకాల’ కారణంగా అనుమతి ఇవ్వలేదు. తర్వాత కాంగ్రెస్ నాయకులు చర్చలు జరిపాక ఇచ్చారు.

మోడీ-అదానీ గూఢపుఠానిని రాహుల్ గాంధీ ఎక్కడ బట్టబయలు చేస్తారోనని మోడీ భయపడుతున్నారు. ఆర్థిక కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాలు ఎక్కడ వెలుగులోకి వస్తాయోనని రాహుల్ నోరు మూయించే ప్రయత్నాలు చేశారు. అందుకు దొడ్డిదారి పద్ధతులు (క్రూక్డ్ మెజర్స్) ఎంచుకున్నారు. అయితే సత్యం, న్యాయం కోసం పోరాడుతున్న రాహుల్ గాంధీకి మద్దతుగా కోట్లాది మంది ప్రజలు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News