Wednesday, January 22, 2025

రామప్పలో ఎమ్మెల్సీ కవిత పూజలు

- Advertisement -
- Advertisement -

 

జిల్లాలోని ప్రపంచ ప్రక్యతి చెందిన యూనేస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శన నిమిత్తం ఎమ్మెల్సీ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమెకు ములుగు జిల్లా కేంద్రంలోని గట్టమ్మ దేవాలయం వద్ద స్థానిక పార్టీ శ్రేనులతో, ప్రజాప్రతినిధులతో కలిసి ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ పుష్ప గుచ్చం అందజేసి శాలువాతో సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  జెడ్పీ చైర్మన్ టీఎస్ రెడ్కో చైర్మన్ ఏరువ సతీష్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News