Sunday, December 22, 2024

రామసేతుపై జులై 26న సుప్రీంలో విచారణ..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రామసేతును జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ బిజెపి నాయకుడు డాక్టర్ సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 26న విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు బుధవారం అంగీకరించింది. తమిళనాడులోని రామేశ్వరం సమీపంలో పంబన్ ద్వీపానికి, శ్రీలంకలోని మన్నార్ ద్వీపానికి మధ్య సముద్రంలో తేలియాడే రాళ్లతో నిర్మించిన ఈ వంతెనను ఆడమ్స్ బ్రిడ్జిగా కూడా వ్యవహరిస్తారు. వానర సేన సహాయంతో శ్రీరాముడు నిర్మించినట్లుగా భక్తులు విశ్వసించే ఈ వారధిని జాతీయ వారసత్వ చిహ్నంగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సుబ్రమణియన్ స్వామి దాఖలు చేసిన పిటిషన్ దీనిపై అత్యవసర, చిన్న అంశంగా పరిగణించి విచారణ చేపట్టాలని కోరగా చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ, జస్టిస్ కృష్ణ మురారి, జస్టిస్ హిమా కోహ్లిల నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది. తన పదవీ విరమణ తర్వాత ఈ పిటిషన్ విచారణకు వస్తుందంటూ తొలుత సరదాగా చమత్కరించిన సిజెఐ రమణ అనంతరం జులై 26న దీనిపై విచారణ చేపడతామని డాక్టర్ స్వామికి తెలియచేశారు.

Supreme Court to hear on Ram Setu over National Heritage Status

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News