Wednesday, January 22, 2025

రాష్ట్రపతి నిలయంలో ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

- Advertisement -
- Advertisement -

పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐదు రోజుల హైదరాబాద్ పర్యటనలో భాగంగా గురువారం రాష్ట్రపతి నిలయంలో మెట్ల భావి వేదికగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. యువ ప్రతిభావంతులు తమ నైపుణ్యాలను ప్రదర్శించి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు. రాఘవరాజ్ భట్, మంగళ భట్ ఆకృతి కథక్ కేంద్ర శిష్య బృందం వారి కథక్ నృత్యం, డా.అశోక్ గుర్జాలే ఆరభి వాయిలిన్ స్కూల్ శిష్య బృందం బ్రహ్మమురారి, వాతాపి గణపతి గానాలపై చేసిన వాయిలిన్ ప్రదర్శన ఆహుతులను మంత్ర ముగ్ధులను చేసాయి.

సాంస్కృతిక ప్రదర్శనల అనంతరం రాష్ట్రపతి నిలయంలో నూతనంగా ప్రారంభించిన మేజ్ గార్డెన్స్‌ను రాష్ట్రపతి సందర్శించారు. అక్కడ, ఆమె రంగురంగుల లైట్లతో అందమైన మ్యూజికల్ ఫౌంటెన్‌ను ఆస్వాదించారు. ప్రకృతి, కళల మిళితం చేసే ఒక ఆహ్లాదకరమైన సన్నివేశం అక్కడ నెలకొన్నది. సాంస్కృతిక గొప్పతనం, ప్రకృతి సౌందర్యం కలగలిసి నేటి రాష్ట్రపతి కార్యక్రమాలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి గవర్నర్ డా. తమిళ సై సౌందర్యరాజన్, రాష్ట్ర గ్రామిణాభివృద్ధి శాఖా మంత్రి సీతక్క తదితరులు హాజరైయ్యారు.

Rashtrapathi 1

Rashtrapathi 3

Rashtrapathi 4

Rashtrapathi 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News