Saturday, December 21, 2024

“రియల్ కేరళ స్టోరీ” విడుదల

- Advertisement -
- Advertisement -

తిరువనంతపురం : ఇటీవల విడుదలైన “ద కేరళ స్టోరీ ” సినిమాపై కేరళ అధికార ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం వినూత్నంగా స్పందించింది. ఆ పార్టీ అధికారం లోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా “ద రియల్ కేరళ స్టోరీ” అనే పేరుతో ప్రకటనను రూపొందించింది. “ మా ప్రభుత్వం కొలువు దీరి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా కలలు వికసించే మానవత్వం పరిమళించే రియల్ కేరళ స్టోరీని ఆనందంగా జరుపుకొంటున్నాం” అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ట్వీట్ చేశారు.
ఎఫ్‌టీఐఐలో “ద కేరళ స్టోరీ” ప్రదర్శన
వివాదాస్పద చిత్రం “ద కేరళ స్టోరీ ”ని పుణె లోని ప్రతిష్ఠాత్మక ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌టిఐఐ) లో ప్రదర్శించడం అక్కడి విద్యార్థి సంఘం తీవ్రంగా వ్యతిరేకించింది. తమకు ముందుగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడమేమిటని ఆందోళన చేశారు. ఈ ఆందోళన ఫలితంగా ఉదయం 9.30 కు ప్రారంభం కావలసిన ప్రదర్శన గంట ఆలస్యమైంది. మరోవైపు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ద కేరళ స్టోరీపై విధించిన నిషేధం సుప్రీం కోర్టు రద్దు చేసినప్పటికీ అక్కడ ప్రదర్శన జరగడం లేదు. ఈ సినిమా ప్రదర్శనకు థియేటర్ల యాజమాన్యాలు ఎవరూ ముందుకు రావడం లేదని డిస్ట్రిబ్యూటర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News