Sunday, January 5, 2025

అవమాన భారంతో యువకుడి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అవమానం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో గురువారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు శివకిషోర్ (16) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో చదువుకుంటున్న తోటి విద్యార్థినితో శివకిషోర్ మాట్లాడుతున్నాడని గ్రహించిన గ్రామస్థులు అతన్ని కొట్టారన్నారు.

అమ్మాయితో మాట్లాడవద్దని తీవ్రంగా కొట్టడంతో అతడు మనస్థాపం చెందాడని తెలిపారు. విద్యార్థిని తల్లి కూడా శివకిషోర్ తల్లిని ఇష్టం వచ్చినట్లు తిట్టడంతో అవమానం భరించలేక శివకిషోర్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడని వారు తెలిపారు. మృతుని తల్లి సునీత ఫిర్యాదు మేరకు శివకిశోర్‌పై దాడి చేసిన గ్రామస్థులు అంబటి హరిబాబు, కందుకుల నవీన్, గెరిగంటి రాకేష్, కాసారం ప్రవీణ్, సోమారపు శ్రీనివాస్‌లపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News