Friday, December 20, 2024

విశాఖకు కృష్ణా బోర్డు!

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం కావటాన్ని గమనించిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం అదను చూసి తెలంగాణను దెబ్బతీసేప్రయత్నం చేసింది. తెలుగురాష్ట్రాలకు సంబంధించిన కృష్ణానదీజలాల పంపిణీ నిర్వహణను సమన్వయం చేస్తున్న కృష్ణానదీయాజమాన్య బోర్డును తక్షణం ఏపికి తరలించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాబోర్డుకు లేఖ రాసింది. కృష్ణాబోర్డును ఏపిలో విశాఖపట్నంకు తరలించాలని లేఖలో పేర్కొంది. విశాఖలో బోర్డు కార్యాలయం ఏర్పాటుకు సంబంధించిన అన్ని వవసతులు సిద్దం చేసి ఉంచామని తెలిపింది. అంధప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ కృష్ణానదీయాజమాన్యబోర్డు తరలింపునకు సంబంధించిన అన్ని విషయాలను వివరిస్తూ ఈ మేరకు చైర్మన్ శివనందన్ కుమార్‌కు లేఖ రాశారు. ఏపి నుంచి వచ్చిన లేఖతో బోర్డు సిబ్బంది కూడా కార్యాలయాన్ని విశాఖకు తరలించేందకు సన్నద్దమవుత్నున్నారు.

ఆంధప్రదేశ్‌లో పరిపాలనకు సంబంధించి ఆ రాష్ట్ర సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి విశాఖపట్నం సిటిని ఏపిపరిపానల రాజధాని కేంద్రంగా చేసుకుని ఈ దసరా నుంచే పరిపాలన సాగించేందుకు అక్కడి ప్రభుత్వం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే ఆలోపే కృష్ణానదీయాజమాన్య బోర్డును కూడా విశాఖపట్నంలో ఏర్పాటు చేసేందుకు సిటీలోని నార్త్‌కోస్ట్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ప్రాంగణంలోని ఒక అంతస్తను పూర్తిగా కృష్ణానదీయాజమాన్య బోర్డు కార్యాలయం ఏర్పాటుకు కేటాయిస్తు అవసరమైన పనులన్ని సిద్దం చేసివుంచింది. అదే విషయాన్ని జలవనరులశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ కుమార్ తన లేఖ ద్వారా బోర్డు చైర్మన్ శివనందన్ కుమార్‌కు వివరించారు.
భగ్గుమంటున్న తెలంగాణ, సీమ రైతాంగం
కృష్ణానదీయాజమాన్యబోర్డును విశాఖపట్నం తరలింపుపై తెలంగాణ, రాయ లసీమ ప్రాంత రైతాంగం భగ్గుమంటోంది. ఈ రెండు ప్రాంతాల ప్రజలనుంచి నిరసనలు పు ట్టుకొస్తున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భం గా కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల నిర్వహణకు సంబంధించి తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక బోర్డులను ప్రకటిచింది. కృష్ణానదీజలాలకు సంబంధించి కృష్ణానదీయాజమాన్యబోర్డును ఏర్పాటు చేసింది. అదే విధంగా గోదావరి జలాల నిర్వహణ కోసం గోదావరి నదీయా జమాన్యబోర్డను ఏర్పాటు చేసింది. ఇందులో కృష్ణాబోర్డను ఏపిలో ఏర్పాటు చేసుకునేవిధంగా, గోదావరి బోర్డను తెలంగాణలో ఏర్పాటు చేసుకునే విధంగా నిర్ణయించింది. అయితే అప్పట్లో తెలంగాణ ,ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కేంద్ర ప్రభుత్వం ప్రక టించింది. ఈ నేపధ్యంలో గోదావరి బోర్డుతోపాటు కృష్ణాబోర్డుకూడా హైదరాబాద్‌లో ని జలసౌధలోనే ఏర్పాటయ్యాయి. అయితే కృష్ణానదీజలలా నిర్వహణకు సంబం ధించి బోర్డు సమావేశాల్లో ఏపికి అనుకూలంగా నిర్ణయాలు లేని ప్రతిసారి ఏపి అధికారులు బోర్డుపట్ల అసంతృప్తిని వెలిబుచ్చుతూ వస్తున్నారు.

ఏకంగా బోర్డును ఎపికి తరలించా లని ప్రకటనలు చేస్తూ ఆమ అక్రోశం వెలిబుచ్చుకూంటు వచ్చారు. మరోవైపు బోర్డు ను ఉంచితే తెలంగాణ, రాయలసీమ ప్రాంత రైతులకు అనుకూలంగా ఉండే హై దరాబాద్‌లోనే ఉంచాలని , తప్పని సరి పరిస్థితుల వల్ల బోర్డు కార్యాలయాన్ని ఏపికి తరలించాల్సి వస్తే కర్నూలు కేంద్రంగా బోర్డ్డును కార్యాలయం ఏర్పాటు చేయాని ఇ టు తెలంగాణతోపాటు రాయాలసీమ ప్రజలుకూడా కోరుతూ వచ్చారు. అంతే కా కుండా జగన్ ప్రభుత్వం కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించింది. ఇక్కడే ఎపి హైకోర్టును కూడా ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నేపధ్యంలో ఇప్పటికే హైదరాబాద్ కేంద్రంగా కొనసాగిని ఎపి లోకాయుక్త కార్యాలయం కూడా గత ఏ డాది హైదరాబాద్ నుంచి కర్నూలుకు తరలిపోయింది. అదే విధంగా ఇప్పుడు కృ ష్ణాబోర్డును కూడా కర్నూలుకే తరలించాలన్న డిమాండ్లు రైతుల నుంచి పు ట్టుకొస్తున్నాయి.
విశాఖకు తరలిస్తే అది బంగాళాఖాతం బోర్డే!
కృష్ణానది జలాలతో ఎటువంటి సంబంధం లేకుండానే ,కనీసం నదీపరి వాహక ప్రాం తానికి వందల కిలోమీటర్ల దూరంలో సముద్రం ఒడ్డున ఉన్న విశాఖపట్నాకి కృ ష్ణాబోర్డును తరలింపు ప్రయత్నాలపట్ల ఇటు తెలంగాణ, అటు రాయలసీమప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. బోర్డును విశాఖకు తరలిస్తే అది కృష్ణాబోర్డగా కాకుండా బంగాళాఖాతం సముద్ర జలాల నిర్వహణ బోర్డుగా పేరు మార్చుకోవాలని సూ చిస్తున్నారు. బోర్డును కర్నూలు లేదా నంద్యాల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఇ ప్పటికే రాయలసీమ జల సాధన సమితి ఉద్యమాలు నిర్వహిస్తోంది. జగన్ ప్రభుత్వం ఏకపక్షంగా బోర్డును విశాఖకు తరలించడాన్ని అడ్డుకుంటామని జలసాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరధరామిరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. త్వరలోనే ఈ అంశంపై మరింత పటిష్టంగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News