Saturday, December 28, 2024

విశాఖ బీచ్ లో అర్ధనగ్నంగా యువతి మృతదేహం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విశాఖ బీచ్ లో వివాహిత మృతదేహం కలకలం రేపింది. వివరాలలోకి వెళితే.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖలోని వైఎంసిఎ బీచ్ లో బుధవారం ఉదయం స్థానికులు అనుమానస్పద స్థితిలో ఉన్న యువతి మృతదేహాన్ని గుర్తించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతిని శ్వేత గా గుర్తించారు. న్యూపోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే వివాహిత శ్వేత మంగళవారం మిస్సింగ్ కేసు నమోదైంది.

ఈ క్రమంలో పోలీసులు శ్వేత కోసం వెతుకుతుండగా బుధవారం ఉదయం బీచ్ లో మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అయితే మృతదేహంపై ఎలాంటి గాయాలు, ఒంటిపై దుస్తులు లేకపోవడంతో ఆత్మహత్య, హత్య అని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా మృతి చెందిన యువతి ఆరు నెలల గర్భవతి అని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్వేత కుటుంబ సభ్యులు మాత్రం ఆమె భర్తే హత్య చేసినట్లు పోలీసులకు చెప్పారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News