Monday, November 18, 2024

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విదేశాల నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తున్న నలుగురిని శంషాబాద్ విమానాశ్రయంలో అధికారులు పట్టుకున్నారు. వారందర్ని వేరు వేరు దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు. వారిపై అనుమానం వచ్చి పరిశీలించగా భారీ ఎత్తున బంగారం పట్టుబడింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబా ద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మొత్తం రూ.4.86 కోట్ల విలువైన 8 కిలోల బంగారాన్ని అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి హైదరా బాద్‌కి వచ్చిన ఇద్దరి వ్యక్తులను గమనించగా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారని అధికారులు తెలుసుకున్నారు. దీంతో వారిని అదు పులోకి తీసుకుని ఆ ఇద్దరి వద్ద 3.78 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. షార్జా నుంచి వచ్చిన మరో ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని నుంచి 2.17 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వస్తున్న మరో వ్యక్తి దగ్గర 2.5 కిలోల బంగారాన్ని గుర్తించిన అధికారులు అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేసిన అధికారులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News