హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) శాసన సభ్యుడికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మీలాను ఆదివారం పోలీసులు అరెస్టుచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి చెల్లెలయిన ఆమెను మహబూబాబాద్‌లో పాదయాత్ర సందర్భంగా అరెస్టు చేశారు.
పట్టణంలో ఎలాంటి శాంతిభద్రత సమస్య ఏర్పడకుండా ఉండేందుకు పోలీసులు ఆమెను నైట్ హాల్ట్ క్యాంప్ వద్ద అరెస్టు చేసి హైదరాబాద్‌కు పంపారు. ఆమె శనివారం సాయంత్రం ఓ బహిరంగ సభలో మహబూబాబాద్ ఎంఎల్‌ఏ బి.శంకర్ నాయక్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమెపై ఐపిసి సెక్షన్ 504ఏ, షెడ్యూల్డ్ ట్రైబ్స్ (దౌర్జన్య నిరోధక) చట్టం సెక్షన్ 3(1) కింద కేసులు నమోదుచేశారు. మహబూబాబాద్ ఎంఎల్‌ఏ శంకర్ నాయక్ అవినీతికి, భూఆక్రమణలకు పాల్పడ్డారంటూ షర్మీలా వ్యాఖ్యలు చేశారని తెలిసింది.
షర్మిలమ్మను అరెస్ట్ చేసిన పోలీసులు. pic.twitter.com/qhDW52XEpP
— 𝐘𝐒𝐑𝐓𝐏 (@YSSR2023) February 19, 2023