- Advertisement -
హైదరాబాద్: శుక్రవారం రాత్రి షాద్ నగర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..ఇవాళ రాత్రి సుమారు 10 గంటల సమయంలో జాతీయ రహదారి 44 ప్యాలే గర్ రెస్టారెంట్స్ సమీపంలో కారు డిసిఎంను ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కారులో నుంచి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్ట్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొలగించి ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చేశారు. ఈ ఘటనకు సంభందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.
- Advertisement -