Friday, December 20, 2024

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై యువకుల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై యువకులు దాడి చేసిన సంఘటన పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…. టిసిఎస్ ఉద్యోగి కుర్వ నవీన్‌కుమార్ కారులో అనురాగ్ విశ్వవిద్యాలయం సమీపంలో ఎనిమిది మంది యువకులు కారును ఆపి దాడి చేశారు.

అంతటితో ఆగకుండా సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని వదలకుండా కొర్రెముల చౌరస్తా వరకు వెంబడించి చితకబాదారు, కారుపై రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. అనంతరం యువకులు బలవంతంగా కారును తీసుకెళ్లారు. తర్వాత నారపల్లి నందనవనం వద్ద కారును వదిలి పారిపోయారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News