- జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్
వికారాబాద్ : సామాజిక పరంగా మార్పు కోసం ప్రజలను జాగృత పరచవలసిన అవసరం ఉందని జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్దార్ అన్నారు. మంగళవారం దోమ మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో గత మాసం తలెత్తిన గొడవల కారణంగా సమస్యను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు జాతీయ ఎస్సీ కమిషన్ డైరెక్టర్ సునిల్ కుమార్, జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్పీ కోటిరెడ్డిలతో కలిసి జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ గ్రామాన్ని సందర్శించి దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో గ్రామస్తులను ఉద్దేశించి ఆయన మాట్లాడు తూ శతాబ్దాల కాలం గడుస్తున్న గ్రామాల్లో అంటరానితనం కొనసాగడం దురదృష్టకరమని అన్నారు.
సమాజంలోని అసమానతలను తొలగించడానికి రాజకీయాలకతీతంగా వివిధ అసమానతలపై అవగాహన కల్పించాలని సూచించా రు. చట్టం ముందు అందరూ సమానమేనని, తప్పు చేసే వారిని ఉపేక్షించకుం డా జిల్లా యంత్రాంగం ఇటువంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్య లు తీసుకోవాలని తెలిపారు. బ్రాహ్మణపల్లిలో జరిగిన సంఘటనలో పాల్గొన్న దోషులపై ఆలస్యం చేయకుండా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలి అన్నారు. బ్రాహ్మణపల్లిలో జరిగిన సంఘటనలపై సానుకూల వైఖరిని అవలంభించినందు కు జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖను ఆయన అభినందించారు.
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో కులాలకతీతంగా ప్రజలంతా సోదర భావం తో మెలగాలన్నారు. బడి అయినా గుడి అయినా కలిసి మెలిసి ఉండాలని సూ చించారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రయత్నిస్తే ఎంతటి వారై నా చర్యలు తప్పవు అన్నారు. ప్రతినెలా నిర్వహించే పౌరహక్కుల దినోత్సవ కా ర్యక్రమాలకు ప్రజాప్రతినిధులు కూడా హాజరై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం సమన్వయంతో ముందుకు వెళు తూ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.
ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ బ్రాహ్మణపల్లిలో జరిగిన సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి ప్రజల అవగాహన కల్పిస్తామన్నారు. గ్రామాల్లో ఇలాంటి సంఘటన జరిగిన మా దృష్టికి తీసుకు వచ్చినట్లయితే పరిష్కార దిశగా పని చేయడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తామన్నారు. జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పెద్దన్న పాత్ర పోషించి బాధ్యత తీసుకుంటానన్నారు. సమావేశంలో బ్రాహ్మణపల్లిలో జరిగిన సంఘటనను గ్రామానికి చెందిన బాధితులు రఘురాం, అనసూయమ్మలు వివరించారు.
అనంతరం వారికి వైస్ చైర్మన్ చేతుల మీదుగా నష్టపరిహారం కింద రూ.25 వేల చొప్పున నష్టపరిహారం చెక్కులను అందజేశా రు. ఈ కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబుమోజెస్, తహసిల్దార్ షహదాబేగం, దళిత సంఘాల నాయకులు కొప్పు భాష, సంగీతం రాజలింగం, వెంకటయ్య పాల్గొన్నారు.