Monday, December 23, 2024

సురక్షిత రవాణా సౌకర్యం కోరిన మహిళ: కెటిఆర్ స్పందన

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే, బస్సు స్టేషన్లలో మహిళల సురక్షిత రవాణాకు అవసరమైన ఒక యంత్రాంగాన్ని నెలకొల్పాలని తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు రాష్ట్ర డిజిపిని కోరారు. హర్షిత అనే ట్విటర్ యూజర్ నుంచి అభ్యర్థనపై కెటిఆర్ ఈ మేరకు స్పందించారు. ప్రజా రవాణా లేదా మెట్రో అందుబాటులో ఉండని రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెలుపల పోలీసులు లేదా మరేదైనా ప్రభుత్వ వ్యవస్థ ట్రాక్ చేసే విధంగా ఉండే రవాణా సౌకర్యాన్ని మహిళలకు సమకూర్చాలని హర్షిత అనే ట్విటర్ యూజర్ మంత్రి కెటిఆర్‌కు విజ్ఞప్తి చేశారు.
ఈ ట్వీట్‌కు కెటిఆర్ వెంటనే స్పందించారు.

రాష్ట్ర డిజిపిని ట్యాగ్ చేస్తూ ఈ అభ్యర్థనను సాధ్యమైనంత త్వరగా పరిశీలించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్ వద్ద అటువంటి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. అంతేగాక ఈ సూచన చేసిన హర్షితను కూడా ఆయన అభినందించారు. కాగా..తెలంగాణ డిజిపి అంజనీ కుమార్ మంత్రి కెటిఆర్ ట్వీట్‌కు స్పందిస్తూ ఈ గొప్ప ఆలోచనకు కార్యరూపం ఇచ్చేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తామని వాగ్దానం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News