Monday, January 20, 2025

సూర్యాపేట‌లో ఐటీ హ‌బ్‌ను ప్రారంభించిన కెటిఆర్..

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట: జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ హ‌బ్‌ను రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కెటిఆర్ తోపాటు మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి, ఎంపి బ‌డుగుల లింగ‌య్య యాద‌వ్, పలవురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జ‌డ్పీ చైర్మ‌న్‌లు పాల్గొన్నారు.

అనంతరం ఐటీ హ‌బ్‌లో మహాత్మ గాంధీ పుట్టినరోజు పురస్కరించుకుని ఆయన చిత్ర‌ప‌టానికి కెటిఆర్ పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. తర్వాత ఐటీ కంపెనీల ప్ర‌తినిధుల‌తో, ఉద్యోగాలు పొందిన యువ‌త‌తో మంత్రులు కెటిఆర్, జ‌గ‌దీశ్ రెడ్డిలు కాసేపు ముచ్చ‌టించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News