Sunday, December 22, 2024

హుక్కా సెంటర్ పై పోలీసుల దాడి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘ఫర్గెట్ మీ నాట్ కేఫ్’ అనే హుక్కా సెంటర్ పై ఎస్ఒటి అధికారులు దాడి చేశారు. మాదాపూర్ లోని దుర్గంచెరువు ప్రాంతంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న “ఫర్గెట్ మీ నాట్ కేఫ్ హుక్కా సెంటర్” పై సైబరాబాద్ మాదాపూర్ పోలీస్ టీమ్ దాడి చేసింది. ప్రభుత్వం నిషేధించిన హానికరమైన హుక్కా ఫ్లేవర్డ్ ఉపయోగించడంతో పాటు సమయం ముగిసిన తర్వాత చట్టవిరుద్ధంగా హుక్కా సెంటర్‌ను నడుపడంతో మాదాపూర్ పోలీసులు కేసులు నమోదు చేశారు. హుక్కా సెంటర్ యజమాని అభినవ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హుక్కా సెంటర్ నుంచి 52 హుక్కా పైపులు, 13 హుక్కా ఫ్లేవర్డ్ పెట్టెలు, 04 హుక్కా ఫ్లేవర్ ప్యాకెట్లు, 10 హుక్కా పాట్స్, 03 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పల్  కు చెందిన అభివన్ రెడ్డి, మియాపూర్ చెందిన దేవులపల్లి చంద్ర శేఖర్ రెడ్డి, అమీన్ పూర్ కు చెందిన అల్లు సందీప్ రెడ్డి,  పాతబస్తీ బౌన్సర్ సయ్యద్ అబ్దుల్ గఫూర్ లను పోలీసు అరెస్టు చేశారు. వీరిలో మరో యజమాని మాదాపూర్ కు చెందిన తొట్టి ఆజం పరారీలో ఉన్నాడు. ఈ హుక్కా సెంటర్ ను సాప్ట్ వేర్ ఉద్యోగి అభినవ్ రెడ్డి, తొట్టి ఆజం  నిర్వహిస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News