Monday, December 23, 2024

హృదయంలో ఉండిపోయే సినిమా..

- Advertisement -
- Advertisement -

Thank You Movie Trailer Released

అక్కినేని నాగచైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 22న విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ “అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చైతన్య మూడు వేరియేషన్స్‌లో అభిమానులకు కావాల్సినంత భోజనం అందిస్తాడు. ఈ సినిమా మన హృదయంలో ఉండిపోతుంది. మా సంస్థకు విక్రమ్ ఓ అద్భుతమైన సినిమాను ఇచ్చారు”అని అన్నారు. అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ “అభిరామ్ అనే యువకుడి జర్నీ ఈ సినిమా. ఓ నటుడిగా ఇలాంటి వేరియేషన్స్ చూపించే సినిమా మళ్లీ రాదు. లవ్ స్టోరీ, రిలేషన్‌షిప్స్, అమ్మ,నాన్న, చెల్లి, అన్నయ్య… ఇలా అన్నింటినీ ఈ సినిమాలో చూపించాం”అని తెలిపారు. దర్శకుడు విక్రమ్ కె.కుమార్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రేక్షకులు ఎంజాయ్ చేసే సినిమా ఇదని చెప్పారు. ఈ కార్యక్రమంలో బివిఎస్ రవి, సాయి సుశాంత్, రాశీఖన్నా తదితరులు పాల్గొన్నారు.

Thank You Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News