Saturday, December 28, 2024

మణిపూర్‌పై సమగ్ర స్థాయీ నివేదిక కోరిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మణిపూర్‌లో తాజా పరిస్థితిపై సమగ్రంగా స్థాయీ నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు సోమవారం మణిపూర్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో హింసాకాండను అదుపుచేయడానికి తీసుకున్న చర్యలు, బాధిత ప్రజల పునరావాసానికి తీసుకున్న చర్యలు, నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాలు, భద్రతా దళాల మోహరింపు, మణిపూర్‌లో తాజా పరిస్థితిని సమగ్రంగా వివరిస్తూ ఒక స్థాయీ నివేదికను సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

కాగా..మణిపూర్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా స్థాయీ నివేదికను సమర్పించడానికి కొంత సమయం కావాలని చేసిన విజ్ఞప్తిని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం అంగీకరించింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 10వ తేదీతో ధర్మాసనం వాయిదా వేసింది.

మణిపూర్ ట్రైబల్ ఫోరమ్ తరఫున సీనియర్ న్యాయవాది కొలిన్ గన్సాల్వేజ్ వాదిస్తూ మణిపూర్‌లో పరిస్థితి దారుణంగా తయారైందని, హింసాకాండలో మరణించిన కుకీ తెగల సంఖ్య 120కి చేరుకుందని తెలిపారు. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాత్రం పరిస్థితి క్రమంగా మెరుగుపడిందని, 14 కంపెనీల కేంద్ర బలగాలతోసహా సివిల్, రిజర్వ్ పోలీసులను రాష్ట్రంలో మోహరించడం జరిగిందని, కర్ఫూ సమయాన్ని కూడా ఐదు గంటలకు తగ్గించడం జరిగిందని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News