Sunday, January 19, 2025

దేశవ్యాప్తంగా బిఎ కోర్సుకు పునఃవైభవం

- Advertisement -
- Advertisement -

దేశవ్యాప్తంగా బిఎ కోర్సుకు పునఃవైభవం
బిఎకు తొలి ప్రాధాన్యమిచ్చి ఎన్‌రోల్ చేయించుకున్న 1.04కోట్ల మంది విద్యార్థులు
ద్వితియ స్థానంలో బిఎస్‌సి, మూడోస్థానంలో బికాం కోర్సులు
పీజీలో సోషల్‌సైన్స్, పీహెచ్‌డీ స్థాయిలో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీవైపు మొగ్గు
ఆలిండియా సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎఐఎస్‌హెచ్‌ఇ) నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్(బిఎ) కోర్సుకు పునఃవైభవం లభించింది. దేశంలో 1.04కోట్ల మంది విద్యార్థులు బిఎ కోర్సుకు తొలి ప్రాధాన్యమిచ్చి ఎన్‌రోల్ చేయించుకున్నారని ప్రభుత్వ నివేదిక వెల్లడించింది. బిఎ కోర్సు తర్వాత ఆఫ్ సైన్స్ (బిఎస్‌సి) రెండో స్థానంలో నిలిచింది. బిఎస్‌సి కోర్సును 49.12లక్షల మంది విద్యార్థులు ఎంచుకున్నారు. ఈ గణాంకాలు ప్రభ్వుత్వ ఆధ్వర్యంలోని సర్వే ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ (ఎఐఎస్‌హెచ్‌ఇ) 202021 నివేదించింది. సర్వే నివేదికను కేంద్ర విద్యామంత్రిత్వశాఖ విడుదల చేసింది.

నివేదిక ప్రకారం మొత్తం 1.04కోట్ల విద్యార్థులు బిఎ కోర్సును ఎంచుకోగా వీరిలో 52.7శాతం బాలికలు, 47.3శాతం మంది బాలురు ఉన్నారు. ద్వితియ స్థానంలో నిలిచిన 49.12లక్షలమంది విద్యార్థులు ఎంచుకోగా 52.2శాతం బాలికలు ఉన్నారు. మూడోస్థానంలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (బికాం) కోర్సును 43.22లక్షలమంది ఎంచుకోగా వీరిలో 48.5శాతం బాలికలు ఉన్నారు. సాంకేతిక విద్యలో బిటెక్ కోర్సును 23.20లక్షల విద్యార్థులు ఎంచుకున్నారు. బిటెక్ కోర్సును తీసుకున్నవారిలో 28.7శాతం విద్యార్థినులు ఉన్నారు. అదేవిధంగా బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (బిఇ)ను 13.42 లక్షలమంది విద్యార్థులు ఎంపిక చేసుకోగా వీరిలో 28.5శాతం విద్యార్థినులు ఉన్నట్లు నివేదిక తెలిపింది.

పీజీలో సోషల్‌ సైన్స్ వైపే మొగ్గు
పోస్టు గ్రాడ్యూయేట్ స్థాయిలోనూ సోషల్ సైన్స్‌వైపే అత్యధికంగా విద్యార్థులు ఆసక్తి చూపారు. 9.41లక్షల మంది విద్యార్థులు సోషల్‌సైన్స్‌ను పిజి కోర్సుకు ఎంపిక చేసుకున్నారు. వీరిలో అధికంగా మంది విద్యార్థినులు ఉన్నారు. మొత్తం సోషల్‌సైన్స్ కోర్సు తీసుకున్న పీజీ విద్యార్థులు 9,41,648విద్యార్థులు కాగా 56.5శాతం విద్యార్థినులు ఉన్నారు. సైన్స్‌లో పిజి చేస్తున్నవారు 6,79,178మంది ఉండగా వీరిలో అత్యధికంగా ‘1.3శాతం విద్యార్థినులు ఉన్నారు. మేనేజ్‌మెంట్ కోర్సులో పీజీ చేస్తున్నవారు 6,86,001మంది విద్యార్థులు కాగా వీరిలో 43.1శాతం విద్యార్థినులు ఉన్నారు. కామర్స్‌లో పీజీ చేస్తున్నవారు 5.36లక్షలు మంది ఉండగా వీరిలోనూ అధికంగా ఉన్నారు. 12వేర్వేరు భారతీయ భాషల్లో పీజీ చేస్తున్నవారు 3.20లక్షల మంది, ఎడ్యుకేషన్‌లో పీజీ చేస్తున్నవారు 2.06లక్షలు ఉండగా మహిళలు ఉన్నారు.

పీహెచ్‌డీ స్థాయిలో ఇంజినీరింగ్
పీహెచ్‌డీ స్థాయిలో అత్యధికంగా ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీవైపు మొగ్గు చూపారు. తర్వాత స్థానంలో సైన్స్ నిలిచింది. ఇంజినీరింగ్‌లో 21విభాగాల్లో మొత్తం 56,625 మంది విద్యార్థులు పీహెచ్‌డీలో ఎన్‌రోల్ చేయించుకున్నారు. వీరిలో 33.3మంది విద్యార్థినులు ఉన్నారు. సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్నవారు 48,600మంది ఉండగా వీరిలో 48.8శాతం విద్యార్థినులు ఉన్నారు. సైన్స్‌లోని మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ తదితర 17విభాగాల్లో విద్యార్థులు పీహెచ్‌డీ చేస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. కాగా విద్యామంత్రిత్వశాఖ 2011నుంచి ఆన్ ఎడ్యూకేషన్ (ఎఐఎస్‌హెచ్‌ఇ)ని నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని విద్యాసంస్థలను పరిగణనలోకి తీసుకున్న ఉన్నత విద్యను అందించేందుకు ఈ సర్వేను ప్రభుత్వం నిర్వహిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News