- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో వ్యాక్సినేషన్ నిరంతరంగా సాగుతోందని డిహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు కోటి 20 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 15 వరకు 30 లక్షల మందికి పైగా రెండో డోసు ఇస్తామన్నారు. జిహెచ్ఎంసిలో వందకు పైగా టీకా కేంద్రాలున్నాయని, 18 సంవత్సరాల పైబడిన వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని, కోవిడ్ సోకి తగ్గినా కూడా ప్రజలు జాగ్రత్త వహించాలన్నారు.
- Advertisement -