Thursday, January 23, 2025

మల్కాజిగిరిలో రూ. 1.2 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

1.2 crore worth of ganja seized in Malkajgiri

రాచకొండ: అంతర్ రాష్ట్ర గంజాయి రవాణా రాకెట్‌ను మల్కాజిగిరి ఎస్ఒటి, చౌటుప్పల్ పోలీసులు ఛేదించారు. వైజాగ్ నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయి రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. ఆరుగురిని అరెస్టు చేయడంతో పాటు ముగ్గురు పరారీలో ఉన్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. త్వరలో వారిని కూడా పట్టుకుంటామని చెప్పారు. నిందితుల దగ్గర నుంచి 360 కిలోల గంజాయి, 3 కార్లు, 8 సెల్ ఫోన్స్, 10 వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రూ. 1.2 కోట్లు విలువ ఉంటుందని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్ భగవత్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News