Sunday, January 19, 2025

‘శంషాబాద్’లో 1.237 కిలోల బంగారం స్వాధీనం

- Advertisement -
- Advertisement -

1.237 kg of gold seized in Shamshabad

 

మనతెలంగాణ/హైదరాబాద్ (శంషాబాద్): శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సుడాన్‌కు చెందిన మహిళ ప్రయాణికురాల నుంచి 1.237 కిలోల విదేశీ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు బుధవారం నాడు స్వాధీనం చేసుకున్నారు. సుడాన్‌కు చెందిన మహిళ దుబాయ్ నుంచి బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఈక్రమంలో సదరు మహిళ బంగారం తరలిస్తోందన్న ముందస్తు సమాచారం మేరకు కస్టమ్స్ అధికారులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేశారు. సుడాన్‌కు చెందిన మహిళా ప్రయాణికురాలు నల్లటి ప్లాస్టిక్ కవర్లో బంగారాన్ని దాచుకుని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. గాజులు, బిస్కెట్ల రూపంలో ఉన్న దాదాపు 1.237 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నామని,పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.64.38 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. మహిళను ఆదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు బంగారాన్ని హైదారాబాద్లో ఎవరికి ఇచ్చేందుకు తీసుకొచ్చారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. ఇదిలావుండగా కస్టమ్స్ అధికారులకు పట్టుబడిన నిందితురాలిపై గతంలో ఏలాంటి కేసులు లేవని కస్టమ్స్ అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News