- Advertisement -
న్యూఢిల్లీ : ఈ ఏడాది దీపావళి పండుగ వేళ రూ 1.25 లక్ష కోట్ల అమ్మకాలు జరిగాయి. కొవిడ్ నుంచి కోలుకున్న భారతదేశంలో పండుగల వేళ అమ్మకాలు పుంజుకోవడమే కాకుండా గత పది సంవత్సరాల దివాళి షాపింగ్ రికార్డును ఇది తిరగరాసింది. క్రమంగా వ్యాపారాలు కోలుకుంటున్న అంశం ప్రజల కొనుగోళ్లు శక్తి తిరిగి పుంజుకుంటున్న వైనం ఈ రికార్డు స్థాయి పరిణామంతో స్పష్టం అయిందని వ్యాపార వర్గాల సంస్థ కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కైట్) శుక్రవారం అధికారిక ప్రకటన వెలువరించింది. ప్రత్యేకించి వస్త్రాలు, నగలు వ్యాపారాలకు సంబంధించి కొనుగోళ్లు ఎక్కువగా జరిగినట్లు నమోదు అయిందని వ్యాపార వర్గాలు తెలిపాయి.
- Advertisement -