Thursday, December 26, 2024

వ్యవసాయ మంత్రిత్వ శాఖకు రూ 1.25 లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వ్యవసాయ మంత్రిత్వశాఖకు కేటాయింపులు 202324 ఆర్థిక సంవత్సరంలో రూ 1.25 లక్షల కోట్లుగా ఉంటాయి. ఆహార సబ్సిడీ కింద 1.97 లక్షల కోట్లు ఉంటాయి. ఇది 202223 సవరించిన అంచనాలతో పోలిస్తే 31.2 శాతం తక్కువనే. కాగా ఎరువులపై సబ్సిడీల మొత్తం రాబోయే ఆర్థిక సంవత్సరంలో రూ 1.75 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది ఇంతకు ముందటి సవరించిన అంచనాలతో పోలిస్తే 22 శాతానికి పైగా తక్కువ. 2023ను ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్‌గా ప్రకటించిన విషయాన్ని తాము పరిగణనలోకి తీసుకుని తృణధాన్యాల దిగుబడి పెంపుదలకు చర్యలు తీసుకుంటారని ఆర్థిక మంత్రి తెలిపారు. భారతదేశం మిల్లెట్స్ ఇయర్ ప్రతిపాదనను ఐరాసలో తీసుకువచ్చిందని, దీనికి 70 దేశాలు మద్దతు ఇచ్చాయని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు. జొన్నలు , రాగులు, బజ్రా, సామలు, కుట్కి, కోడో, కంగ్ని, రందాన్ వంటి తృణధాన్యాలను భారతదేశం శ్రీ అన్నగా పిలుస్తుంది. ప్రపంచంలో వీటి ఎగుమతులలో భారతదేశం రెండో స్థానంలో ఉంది.

దేశంలో పలు రకాల శ్రీ అన్న ధాన్యాల దిగుబడి విరివిగా ఉందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఇక ప్రత్యామ్నాయ ఎరువుల వాడకం రసాయనిక ఎరువుల వాడకం లేని , సహజపద్థతుల వ్యవసాయ సాగుకు కేంద్రం సహకారం అందిస్తుందని, ఈ దిశలో దాదాపు కోటి మంది రైతులను ఎంచుకుని సహజసిద్ధ, రసాయనిక ఎరువుల రహిత సాగు పద్ధతులకు ప్రోత్సాహం అందిస్తారని వివరించారు. ఈ పథకాన్ని పిఎం ప్రణామ్ అని వ్యవహరిస్తారు. చిన్న సన్నకారు రైతులకు ఉద్ధేశించి సహకార ప్రాతిపదికన సాగే ఆర్థిక వృద్ధి దిశలో సాగు ఏర్పాట్లు ఉంటాయని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 63000 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల కంప్యూటరీకరణ కార్యక్రమం రూ 2516 కోట్ల వ్యయంతో జరుగుతుంది. దేశంలోని కోటానుకోట్ల మందికి ప్రాధమిక స్థాయిల్లో ఈ సహకార సంఘాల నుంచి రుణాలు అందుతున్నాయని ఆర్థిక మంత్రి తెలిపారు.

ఇక దేశంలో పొడవు రకం పత్తి పంట ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటారు. క్లస్టర్ ప్రాతిపదికన ఉండే విలువల ఆధారిత గొలుసుకట్టు దృక్పథ చర్యలలో ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ దిశలో చర్యలు ఉంటాయని మంత్రి వివరించారు. రైతులు, ప్రభుత్వం, పరిశ్రమ వర్గాల మధ్య సరైన సహకారం ఉండేలా చూసుకుంటారు. రైతులకు సకాలంలో ఇన్‌పుట్ సరఫరాలు, విస్తారిత సేవలు, మార్కెట్ అనుసంధాన ప్రక్రియ దిశలో పారిశ్రామిక వర్గాలు తోడ్పాటు అందిస్తాయని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News