ఢిల్లీ: భారతలో కరోనా వైరస్ విలయ తాండవం సృష్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత 24 గంటల్లో 1.26 లక్షల కరోనా కేసులు నమోదుకాగా 685 మంది మృత్యువాతపడ్డారు. కరోనా కేసుల సంఖ్య 1.29 కోట్లకు చేరుకోగా 1.66 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వ్యాధి నుంచి 1.18 కోట్ల కోలుకోగా 9.1 లక్షల మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 9.01 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. భారత్‌లో 25.3 కోట్ల మంది కరోనా టెస్టులు చేశామని ఐసిఎంఆర్ ప్రకటించింది. కరోనా కేసుల సంఖ్యలో మహారాష్ట్ర (31.73 లక్షలు) తొలి స్థానంలో ఉండగా వరసగా కేరళ(11.44 లక్షలు), కర్నాటక(10.33 లక్షలు), ఆంధ్రప్రదేశ్(9.13 లక్షలు), తమిళనాడు(9.11 లక్షలు), ఢిల్లీ(6.9 లక్షలు), ఉత్తర ప్రదేశ్(6.45 లక్షలు) రాష్ట్రాలు ఉన్నాయి. తెలంగాణ 14వ స్థానంలో ఉంది.