Wednesday, January 22, 2025

మేలో 1.33 కోట్ల మంది విమాన ప్రయాణం

- Advertisement -
- Advertisement -

దేశీయంగా పెరిగిన విమాన ప్రయాణికుల రద్దీ: డిజిసిఎ
న్యూఢిల్లీ: దేశీయ విమాన ప్రయాణికుల రద్దీ వేగంగా పెరుగుతోంది. మే నెలలో దేశీయ విమానాలు 132.67 లక్షల మంది(1.33 కోట్లు) ప్రయాణికులను తీసుకువెళ్లాయి. ఇది గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే 15 శాతం ఎక్కువగా ఉంది. ఈమేరకు విమాన నియంత్రణ సంస్థ డిజిసిఎ గురువారం విడుదల చేసిన డేటాలో వెల్లడించింది. ఏడాది క్రితం(2022) మేలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 114.67 లక్షలుగా ఉందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) తెలిపింది. బడ్జెట్ ఎయిర్‌లైన్ ఇండిగో మా ర్కెట్ వాటా 2022 మేలో 57.5 శాతం నుండి గత నెలలో 61.4 శాతానికి పెరిగింది. 2023 మేలో ఇండిగో విమానాలు 81.10 లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్లాయి.

గత నెలలో ఎయిర్‌లైన్ గోఫస్ట్ దివాలా ప్రక్రియ కూడా ప్రారంభమైంది. మే 3 నుంచి గోఫస్ట్ విమాన సర్వీసులను నిలిపివేశారు. మూడు టాటా గ్రూప్ ఎయిర్‌లైన్స్-ఎయిర్ ఇండియా, ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా మార్కెట్ వాటా కూడా వార్షిక ప్రాతిపదికన వరుసగా 9.4 శాతం, 7.9 శాతం, 9 శాతం చొప్పున వృద్ధిని సాదించాయి. డేటా ప్రకారం, మే నెలలో ఎయిర్ ఇండియాలో మొత్తం 12.44 లక్ష ల మంది ప్రయాణించగా, విస్తారాలో 11.95 ల క్షల మంది ప్రయాణించారు. ఎయిర్ ఏషియా ద్వారా 10.41 లక్షల మంది ప్రయాణించారు. టాటా గ్రూపునకు చెందిన మూడు విమానయాన సంస్థల ద్వారా మే నెలలో మొత్తం 34.8 లక్షల మంది ప్రయాణించారు. ఇది మొత్తం దేశీయ విమాన ప్రయాణికుల కంటే ఎక్కువగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News