Thursday, December 19, 2024

సాగు.. భళా!

- Advertisement -
- Advertisement -

1.34 కోట్ల ఎకరాల విస్తీర్ణంలో
పంటల సాగు.. ఇది ఆల్ టైం రికార్డ్

మన తెలంగాణ/హైదరాబాద్ : అనుకూల వాతావరణం..పుష్కలంగా కురిసిన వర్షాలు.. సమృద్ధిగా జలాలు వానాకాల పటల సాగు విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ రంగం కీర్తిని పతాక స్థాయికి చేర్చాయి. రాష్ట్రంలో ఈ వానాకాలం అన్ని రకాల పంటలు కలిసి కోటి34లక్షల 89వేల ఎకరాల విస్తీర్ణంలో సాగులోకి వచ్చా యి. గత ఏడాది వానాకాలంతో పోలిస్తే ఈ సారి 5లక్షల ఎకరాల విస్తీర్ణంలో అధికంగా పంటల సాగు జరిగింది. రా ష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడా వరినాట్లు కొనసాగుతున్నాయి. సీజన్ చివరి వారంలోకి ప్రవేశించింది.ఈ నెల 21తో వానాకాల పంటల సాగు ప్రక్రియ ముగియ నుంది. ఈ వారం రోజుల్లో మరో ఐదారు లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగే అవకావం ఉన్నట్టు వివిధ జిల్లాల నుంచి వ్యవసాయశాఖ అధికారులు అందజేస్తున్న సమాచారాన్ని బట్లి తెలుస్తోంది.

ఈ అంచనాలను బట్టి ఈసారి వానాకాల పం టల సాగు కోటి40 లక్షల ఎకరాల విస్తీర్ణానికి చేరుకోవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఏడాది వానాకాలం పంట ల సాగు అదను ప్రారంభంలో ఆహార ధాన్యాలు ,పప్పుధాన్యాలు, నూనెగింజలు వాణిజ్య పంటలు కలిపి రాష్ట్రంలో సాగయ్యే మొత్తం 23 రకాల పంటలు 1.12కోట్ల ఎకరాల్లో సాగుకు లక్ష్యాలు రూపొందించింది. అయితే రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురిసి పంటల సాగుకు వాతావరణం అనుకూలిచంటం , రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం అందజేయటం, భారీ వర్షాలతో కృష్ణాగోదావరి నదుల పరివాహకంగా ఉన్న భారీ, చిన్న తరహా ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో నీటితో నిండిపోవటం తదితర కారణాలతో రైతులు ఎంతో ఉత్సాహంగా పంటలు సాగు చేస్తూ వచ్చారు.

సాధారణం 109%

ఈ సమయానికి 1.11కోట్ల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు కావాల్సిఉండగా ఇప్పటికే 1,34,89,395ఎకరాల విస్తీర్ణంలో పంట లు సాగులోకి వచ్చాయి. ఏడాది ఇదే సమయానికి రాష్ట్రంలో 1.25కోట్ల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఈసారి సాధారణ సాగు లక్ష్యాల కంటే 109 శాతం విస్తీర్ణంలో పంటల సాగు జరిగింది. వానాకాల సీజన్‌లో ఇది సరికొత్త రికార్డు అని అధికారులు వెల్లడించారు.

64లక్షల ఎకరాలలలో వరినాట్లు పూర్తి

రాష్ట్రంలో ప్రధాన ఆహార ధాన్య పంటలకు సంబంధించి ఇప్పటివరకూ 64లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. గత ఏడాది ఇదే సమయానికి 52.09లక్షల ఎకరాల్లో వరినాట్లు పూర్తయ్యాయి. ఈసారి ఎకరాల్లో అధికంగా వరినాట్లు పడ్డాయి. జొన్న 35907 ఎకరాలు, సజ్జ 1002, మొక్కజొన్న 6,20,024, రాగి 641 సాగులోకి వచ్చాయి. పంటలు 6,55,638 సాగులోకి వచ్చాయి. వీటిలో కంది 5,58,826 పెసర 66,838, మినుము 29,293, ఉలవ 319 ఎకరాలు సాగులోకి వచ్చాయి. నూనెగింజ పంటలు 4,54,838ఎకరా ల్లో సాగు చేశారు. ప్రధానంగా వేరుశనగ 15971 ఎకరాల్లో సాగులోకి రాగా, సోయాబీన్ 4,33,130ఎకరా ల్లో సాగు చేశారు. వాణిజ్య పంటల్లో ప్రధానంగా పత్తి పంట 49,79,225 సాగు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News