Monday, December 23, 2024

మోడీ వన్ థర్డ్ ప్రధాని మాత్రమే: జైరామ్ రమేశ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న ఎన్ డిఏ కూటమిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేశ్ వ్యంగ్యంగా మాట్లాడారు. 2024 లోక్ సభ ఎన్నికలు మోడీకి పరాజయాన్నిఅందించాయన్నారు.  ఇప్పుడు మోడీ వన్ థర్డ్ ప్రధాని మాత్రమేనని చలోక్తి విసిరారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు.

ఎన్ డిఏ అంటే నరేంద్ర, నాయుడు, నితీశ్ సర్కార్ అని ఎద్దేవా చేశారు. ఈ ముగ్గురు నేతలు ప్రధాని కుర్చీ కోసం అపసోపానాలు పడుతున్నారని అన్నారు. పార్లమెంటరీ ఎన్నికల్లో బిజెపి సాధించింది కేవలం 240 సీట్లు మాత్రమే. కానీ ప్రచారంలో 400 ప్లస్ అని ప్రచారం చేసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన 272 సీట్ల మ్యాజిక్ ఫిగర్ కూడా చేరలేదు. అందుకోసమే బిజెపి మిత్ర పక్షాల మద్దతు కోరుతోంది. ప్రస్తుతం టిడిపి, జెడి(యూ) కీలక పాత్ర పోషిస్తున్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News