Wednesday, January 22, 2025

సంక్రాంతి రికార్డ్‌ను బ్రేక్ చేసిన టిఎస్ ఆర్టీసి

- Advertisement -
- Advertisement -

ఎన్నికల వేళ ప్రయాణికుల తాకిడితో టిఎస్ ఆర్టీసి సంక్రాంతి పండుగ రికార్డ్‌ను బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని టిఎస్ ఆర్టీసి ఎండి సజ్జనార్ తెలిపారు. సంక్రాంతి కన్నా 10 శాతం పైగా ప్రయాణికులు ఆర్టీసి బస్సులను వినియోగించుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఆర్టీసి బస్సుల్లో 1.42 లక్షల మంది ప్రయాణించగా ఇందులో ఎపికి 59,800 మంది ప్రయాణం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం పోలింగ్ జరుగనుండడంతో ప్రయాణికుల సంఖ్య మరింత పెరిగి అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవేళ్ల లోక్‌సభ పరిధిలో నివాసం ఉండే సెటిలర్లు అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో తమ ఓటు హక్కను వినియోగించుకునేందుకు ఎపికి బయలుదేరి వెళ్లారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News