Saturday, November 16, 2024

ప్రైవేటు స్కూళ్లు…. 1.45 లక్షల సిబ్బందికి సాయం: సబిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కరోనా వల్ల తాత్కాలికంగా స్కూళ్లు మూసివేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బిఆర్‌కె భవన్‌లో ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఆర్థిక సాయంపై జరిగిన మంత్రుల సమావేశంలో సబితా మాట్లాడారు. కరోనా సమయంలో కూడా ప్రైవేటు ఉపాధ్యాయులను ఆదుకుంటున్నది ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు సిబ్బందికి రెండు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. 10 వేల 500 స్కూళ్లలో లక్షా 45 వేల మందికి ఉపాధ్యాయులు, సిబ్బందికి సాయం చేశామని, ఈ మేరకు కలెక్టర్లకు సబిత అదేశాలు జారీ చేశారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించేంతవరకు ప్రతి నెలా రెండు వేల రూపాయలు, 25 కిలోల సన్నబియ్యం అందిస్తామన్నారు. 45 రోజుల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది డేటా సేకరణ, పంపిణీ ప్రక్రియ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సిఎం కెసిఆర్ అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేందుకు చర్యలు చేపట్టారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News