Saturday, November 16, 2024

ఆర్టీసికి రోజుకు రూ.1.50 కోట్లు నష్టం

- Advertisement -
- Advertisement -

1.50 crore per day loss to TSRTC

=పెరిగిన డీజిల్ వ్యయం
=కష్టంగా మారిన నిర్వాహణ వ్యయం

హైదరాబాద్ : గ్రేటర్ ఆర్టీసి ఆర్థిక కష్టాల నుంచి ఇప్పట్లో బయటపడే పరిస్థితి కనిపించడం లేదు. ఒక వైపు చాలీచాలని బస్సుల తో అధికారులు నెట్టుకొస్తున్న వాటి ద్వారా వచ్చే ఆదాయం రోజూవారీ నిర్వాహణకు ఏమాత్రం సరిపోవడం లేదు. దాంతో డీజిల్ ధరలు పెరగడం తో మరీ సంస్థకు ఆర్థిక సమస్యలు మరిన్ని చుట్టుముట్టాయి. గ్రేటర్ హైదరాబాద్‌లో డీజిల్ ధర ప్రస్తుతం రూ. రూ ః 88.86. గ్రేటర్‌లో బస్సుల్లో ప్రతి రోజు 1 లక్షా 30 వేల డీజిల్ అధికారులు వినియోగిస్తున్నారు. డీజిల్ వ్యయానికి వచ్చే ఖర్చులకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. గ్రేటర్‌లో ఆర్టీ సి ప్రతి రోజు రూ. 2 కోట్లు ఆదాయం వస్తుంటో దానిలో సుమారు ఒక కోటి రూపాయలు డిజిల్ ఖర్చులకు పోగా మరో 50 లక్షలు ఇతర ఖర్చులకు సరిపోతుంది. దీంతో సిబ్బందికి వేతనాలు చెల్లించడం కూడా కష్టంగా మారింది.

గ్రేటర్‌లోని హైదరాబాద్‌లోని 29 డిపోల ద్వారా ఆర్టీసి ప్రతి రోజు సుమారు 2250 బస్సులు 5 నుంచి 7 లక్షల వరకు తిరుగుతున్నా యి. వాటిలో కొన్ని బస్సులు మరీ తక్కువ మైలేజ్‌ను ఇవ్వడంతో రోజువారీ వ్యయం పెరిగి సంస్థ ప్రతి రోజు రూ.1 కోటి 50 లక్షల నష్టానాఇ్న చవి చూడాల్సి వస్తోంది. దీంతో ఏడాదికి ఇవి రూ. 350 కోట్లుకు పైగా నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూడాల్సి వస్తోం ది. 2019లో ఆర్టీసి చార్జీలు కొంత పెంచినా తర్వాత ఆర్టీసి కార్మికుల సమ్మె, కరోనా వంటి కారణాలో బస్సులన్నీ డిపోలకే పరిమితం కావాల్సి రావడంతో పెద్దఎత్తున నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. సమ్మె, కరోనా తదితర పరిస్థతులు కారణంగా నగరంలో తిరిగే 3750 బస్సుల్లో సుమారు 1000 బస్సులను పక్కన పెట్టాల్సి వచ్చింది. వాటి లో కూడా 75 శాతం మాత్రం రోడ్డుమీద తిరుగుతున్నాయి. గత ఏడాది కొవిడ్ సంస్థను ఆర్థ్దికంగా దెబ్బతీసింది. దీంతో బస్సులు ఎక్కే ప్రయాణికులు సంఖ్య కూడా భారీ సంఖ్యలో తగ్గింది.

కరోనాకు ముందు ప్రతి రోజు 33 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన ఆర్‌టిసి ప్రస్తుతం 20 నుంచి 25 లక్షల మందిని మాత్రమే గమ్యస్థానాలకు చేరుస్తోంది. గ్రేటర్ గత రెండు నెలలుగా క్రమ ంగా అన్ని కార్యాయలు, వ్యాపార సంస్థలు తిరిగి తెరుచకోవడం, పాఠశాలలు, కాలేజీలు తిరగి ప్రారభం అయినా ఆర్టీసి మాత్రం పూర్థిస్థాయిలో బస్సులను నడపక పోవడంతో ఈ పరిస్థితి కారణమైంది. పోరుగున ఉన్న బెంగుళూర్‌లో నగర ప్రజ ల అవసరాల కోసం 6 వేల బస్సులు కెఎస్‌ఆర్‌టిసి నడుపుతోంది. దాంతో పోలిస్తే మన గ్రేటర్‌లో 2500లకు మించి సంస్థ నడపలేక పోతుంది.

గ్రేటర్‌లో వజ్ర,ఏసీ బస్సులు మినహా మరో కొత్త బస్సు లు లేక పోవడంతో ఉన్న వాటికి మరమ్మత్తులు నిర్వహిస్తూ మందుకు నెట్టుకొస్తున్నారు.దీంతో ముక్కుతూ మూలుగుతు నడస్తుండంతో ప్రయాణికులు వాటిలో ప్రయాణించేందుకు కూడా పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం సంస్థకు బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయించింది. దాని ప్రకారం సంస్థకు వాటిలో 30 శాతం వరకే కేటాయించే అవకాశం ఉంది. దాంతో సంస్థ గుడ్డిలో మెల్ల అన్నచందంగా బయటపడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం డిజిల్ ధరలు నిలకడగా ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా పెరిగితే సంస్థను మరిన్ని కష్టాలు చుట్టిముట్టే అవకాశం ఉంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News