- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రతిరోజూ 10వేల చొప్పున అదనంగా కేసులు పెరగుతున్నాయి. నిన్న ఒక్కరోజే దేశంలో రికార్డు స్థాయిలో 1,68,912 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా ముంబయి, ఢిల్లీ, పుణెలో 10వేలకు పైగా డైలీ కేసులు నమోదవుతున్నాయి. తమిళనాడు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్‌లోనూ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య కోటీ 35 లక్షలకు పైగా చేరుకుంది. తాజాగా మరో 904 మంది కొవిడ్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 1,70,209కు చేరింది. 24 గంటల్లో కరోనా నుంచి 75,086 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 12,01,009 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
1.70 lakh New Corona Cases Reported in India
- Advertisement -