Monday, December 23, 2024

స్వామి వారికి 1.792 కిలోల బంగారు కిరీటం

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట : వైకుంఠ ఏకాద‌శి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని  సిద్దిపేట‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామి ఆల‌యాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు సోమ‌వారం ఉద‌యం సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా స్వామి వారికి 1.792 కిలోల బంగారు కిరీటాన్ని స‌మ‌ర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారిని ద‌ర్శించుకున్న మంత్రి హ‌రీశ్‌రావుకు వేద పండితులు ఆశీర్వ‌చ‌నాలు అందించారు. అనంత‌రం తీర్థ ప్ర‌సాదాలు అందించారు. వైకుంఠ ఏకాదశి సంద‌ర్భంగా స్వామి వారిని ద‌ర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News