Monday, December 23, 2024

టిఆర్‌పి అదుర్స్…

- Advertisement -
- Advertisement -

దుబాయి: యావత్ క్రికెట్ ప్రపంచం కళ్లప్పగించి ఎదురు చూసిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ ఊహించనట్లుగానే కనువిందు చేసింది. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తూ ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ సూపర్ డూపర్ హిట్టయ్యింది. అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ పంట పండించింది. రికార్డు వ్యూయర్‌షిప్‌తో సరికొత్త చరిత్ర లిఖించింది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ డిస్నీ హాట్‌స్టార్స్ గత రికార్డులన్నిటినీ బ్రేక్ చేస్తూ ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది. ఈ మ్యాచ్ దెబ్బకు గత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. ఆసియాకప్ వేదికగా భారత్‌పాక్ తొలి మ్యాచ్ 1.30 కోట్ల వ్యూస్‌తో ఐపిఎల్ 2022 సీజన్, గత టి20 ప్రపంచకప్ వ్యూయర్‌షిప్ రికార్డులను బద్దలు కొడితే.. తాజా భారత్‌పాక్ మ్యాచ్ 1.80 కోట్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. హాట్‌స్టార్‌లోనే ఇన్ని వ్యూస్ వచ్చాయంటే.. ఇక టిఆర్‌పి రేటింగ్స్‌లో స్టార్ స్పోర్ట్స్‌కు రికార్డు లాభాలను తెచ్చిపెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News