Monday, December 23, 2024

జిఎస్‌టి వసూళ్లలో సరికొత్త రికార్డు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : జిఎస్‌టి(వస్తు సేవల పన్ను) వసూళ్లలో ప్రభుత్వం సరికొత్త రికార్డు సృష్టించింది. ఏప్రిల్‌లో ప్రభుత్వం జిఎస్‌టి ద్వారా రూ.1.87 లక్షల కోట్లు వసూలు చేసింది. గతేడాది ఏప్రిల్‌లో అత్యధికంగా రూ.1.67 లక్షల కోట్ల జిఎస్‌టి ఆదాయం రాగా, ఇప్పుడు దీనిని అధిగమించింది. వార్షిక ప్రాతిపదికన జిఎస్‌టి ఆదాయం 12 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇక 2023 మార్చిలో జిఎస్‌టి వసూళ్లు రూ.1.60 లక్షల కోట్లు వచ్చాయి. మొత్తం జిఎస్‌టి వసూళ్లలో సిజిఎస్‌టి రూ.38,440 కోట్లు, ఎస్‌జిఎస్‌టి రూ.47,412 కోట్లు, ఐజిఎస్‌టి రూ.89,158 కోట్లు, సెస్ రూ.12,025 కోట్లు వసూళ్లు వచ్చాయి.

ఏప్రిల్ జిఎస్‌టి వసూళ్ల పరంగా టాప్-5 రాష్ట్రాలలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్రలో జిఎస్‌టి వసూళ్లు గతేడాది కంటే 21 శాతం పెరిగి రూ.33,196 కోట్లుగా ఉన్నాయి. ఇక ఈ జాబితాలో రూ.14,593 కోట్ల వసూళ్లతో కర్నాటక రెండో స్థానంలో ఉండగా, రూ.11,721 కోట్ల వసూళ్లతో గుజరాత్ మూడో స్థానంలో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరం మొత్తంగా చూస్తే రూ.18.10 లక్షల కోట్ల జిఎస్‌టి ఆదాయం నమోదైంది. దీని ఆధారంగా ప్రతినెలా సగటున జిఎస్‌టి వసూళ్లు రూ.1.51 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో జిఎస్‌టి స్థూల ఆదాయం గత ఆర్థిక సంవత్సరం(2021-22) కంటే 22 శాతం ఎక్కువగా ఉంది.

2023లో శుభారంభం : మోడీ

2023 ఏప్రిల్‌లో జిఎస్‌టి వసూళ్లు రూ.1.87 లక్షల కోట్లతో జీవితకాల గరిష్ఠానికి చేరాయని, కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చిందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మెరుగైన డేటా అనలిటిక్స్ ద్వారా లీకేజీని పూరించడం సహకరించింది. జిఎస్‌టి ఆదాయం పెరగడం ద్వారా ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధిని సాధిస్తున్న దేశంగా భారత్ ముందుందని మోడీ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News