Thursday, January 23, 2025

ముంబయిలో భారీగా డ్రగ్స్ పట్టివేత..

- Advertisement -
- Advertisement -

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. సోమవారం ఉదయం ముంబయిలోని అంతర్జాతీయ విమానాశ్రంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కెన్యా నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడిని నుండి 1.9 కేజీల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. లగేజీ బ్యాగు కింద భాగంలో దాచి తీసుకొచ్చిన కొకైన్ ను స్క్రీనింగ్ వద్ద అధికారులు పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్ లో సుమరు రూ.12.98కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పేర్కొన్నారు.

Also Read: తాడిపత్రి సిఐ ఆత్మహత్య..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News