Friday, December 20, 2024

హోం మంత్రిత్వశాఖకు రూ 1.96లక్షల కోట్లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌లో అంతర్గత భద్రతకు ప్రాధాన్యతను ఇచ్చే దిశలో హోం మంత్రిత్వశాఖకు రూ 1.96 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో అత్యధికం కేంద్ర సాయుధ బలగాలైన సిఆర్‌పిఎఫ్, ఇంటలిజెన్స్ దళాలకు ఖర్చుల కోసం చెందుతాయి. అమిత్ షా సారధ్యపు హోం మంత్రిత్వశాఖకు ఈ సారి బడ్జెట్‌లో కేటాయింపులు రూ 1,96,034.94 కోట్లు, 2022 23 బడ్జెట్‌లో ఇది రూ 1,85,776.55 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఇతోధికంగా పెంచిన కేటాయింపులతో అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి మౌలిక సాధనాసంపత్తిని పెంచడం, పోలీసు వ్యవస్థ బలోపేతం, ఆధునీకరణ పనులు వేగవంతం చేస్తారు. ఇప్పుడు కేటాయించిన మొత్తంలో అత్యధిక వాటా కేంద్రీయ సాయుధ పోలీసు బలగాలకు (సిఎపిఎఫ్)కు చెందుతుంది. ఇది రూ 1,27,756.74 కోట్లుగా ఉంటుంది. ఇంతకు ముందు బడ్జెట్ 2022 23లో ఇది రూ 1,19,070గా ఉంది. ఇందులో అంతర్భాగంగా ఉంటూ అంతర్గత భద్రతను పర్యవేక్షించే ప్రత్యేకించి జమ్మూ కశ్మీర్‌లో తీవ్రవాదం, ఉగ్రవాదం ఏరివేత పనులలో ఉండే సిఆర్‌పిఎఫ్‌కు ఈసారి రూ 31,772.23 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 31,495.88 కోట్లుగా ఉంది.

* సరిహద్దు భద్రతా బలగాలు అయిన బిఎస్‌ఎఫ్‌కు సంబంధించి ఈసారి రూ 24,771.28 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 23,557.51 కోట్లుగా ఉంది.

* సిఐఎస్‌ఎఫ్‌కు రూ 13,214.68కోట్లు కేటాయించారు. ఇప్పటివరకూ ఇది రూ 12,293.23 కోట్లుగా ఉంది. దేశంలోని అణు కేంద్రాలు, ఎయిర్‌పోర్టులు, మెట్రో నెట్‌వర్క్‌ల భద్రతవిధులలో ఈ బలగాలు ఉంటాయి.

*షశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బికి) రూ 8329.10 కోట్లు కేటాయించారు. ఇప్పటివరకూ ఇది ఇది రూ 8,019.78 కోట్లుగా ఉంది.
ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు (ఐటిబిపి)కి రూ 8,096.89 కోట్లు కేటాయించారు. ఇంతకు ముందు ఇది రూ 7,626.38కోట్లుగా ఉంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఐటిబిపి విధులు నిర్వర్తిస్తుంది.

*అస్సామ్ రైఫిల్స్‌కు ఈసారి బడ్జెట్‌లో రూ 7,052.46 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 6,561.33 కోట్లుగా ఉంది.

*నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్‌ఎస్‌జి)కి రూ 1,286.54 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 1,183.80 కోట్లుగా నిలిచింది.

*ఇంటలిజెన్స్ బ్యూరోకు రూ 3,418.32 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 3,022.02 కోట్లుగా ఉంది.

*ప్రత్యేక రక్షక దళం (ఎస్‌పిజి)కి ఈసారి బడ్జెట్‌లో రూ 433 .59 కోట్లు కేటాయించారు. ప్రధాన మంత్రికి భద్రతను పర్యవేక్షించే ఈ దళానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు కేటాయింపులు రూ 411.88 కోట్లుగా ఉన్నాయి.

*ఢిల్లీ పోలీసుకు రూ 11,662.03 కోట్లు కేటాయించారు. ఇది ఇంతకు ముందు రూ 11,617.59 కోట్లుగా ఉంది.
సరిహద్దులలో రహదారులు ఇతరత్రా నిర్మాణాలకు
ఈసారి కేంద్ర బడ్జెట్‌లో దేశ సరిహద్దులలో మౌలిక సాధనాసంపత్తిని అంటే రోడ్లు, వంతెనలు , టన్నెల్‌స వంటివి నిర్మించేందుకు , మరమ్మత్తులకు రూ 3,545 .03 కోట్లు కేటాయించారు. ఇంతకు ముందు ఇది రూ 3,738.98 కోట్లుగా ఉంది.

పోలీసు బలగాల సాధనాసంపత్తిని పెంచేందుకు రూ 3636.66 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 2,188.38 కోట్లుగా ఉంది.
దేశంలో సవాళ్లను ఎదుర్కొనే దిశలో పోలీసు బలగాల ఆధునీకరణకు రూ 3750 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 2432.06 కోట్లుగా ఉంది. ఇక దేశంలో భద్రతా విషయాల సంబంధిత వ్యయాలకు రూ 2780 .88 కోట్లు కేటాయించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రూ 52,432.06 కోట్లుగా ఉంది.

*జనగణన సంబంధిత ఖర్చులకు రూ 1564 .65 కోట్లు కేటాయించారు,

*దేశంలో మహిళా భద్రతా చర్యలకు వ్యయ కేటాయింపులను రూ 1,100 కోట్లుగా ఖరారు చేశారు.

*నేర పరిశోధనలకు ఉపయోగించే ఫోరెన్సిక్ వనరుల బలోపేతానికి రూ 700 కోట్లు కేటాయించారు.

*బార్డర్ చెక్‌పోస్టుల నిర్వహణకు రూ 350.61కోట్లు, సిఎపిఎఫ్‌ల ప్లాన్ 4 ఆధునీకరణకు రూ 202.27 కోట్లు కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News